టెర్రిఫిక్! సాయి ధరమ్ తేజ్ లుక్ చూడ‘రేయ్’(ఫోటో)

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో 'రేయ్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరో హీరోయిన్లు. ఫిబ్రవరి 5న సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తునప్నారు.

సాయి ధరమ్ తేజ్ మెగా కుటుంబానికి చెందిన హీరో కావడంతో ఈ చిత్రం విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తరచూ విడుదల చేస్తున్న ప్రచార చిత్రాలు అదిరిపోయే విధంగా ఉండటం కూడా మరో కారణం. తాజాగా విడుదలైన ఈ చిత్రం పోస్టర్లో సాయి ధరమ్ తేజ్ లుక్ డిఫరెంటుగా, టెర్రిఫిక్‌గా ఉండటం ఆకట్టుకుంటోంది.

దర్శకుడు వైవిఎస్ చౌదరి సినిమా గురించి మాట్లాడుతూ...2010 అక్టోబర్ దసరాకి ప్రారంభమైన ఈ సినిమా చాలా కారణాల వల్ల ఆలస్యమైంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని సినిమాని పూర్తి చేసాం. నమ్మిన సిద్ధాంతం మంచిదైతే ఏ పని మధ్యలో ఆపకూడదు అనే ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, నేను జయాపజయాలను పట్టించుకోను అనే పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సినిమా పూర్తి చేసాను అన్నారు.

'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు తెలిపారు. జనవరి 5న ఈచిత్రం ఆడియో విడుదల చేయనున్నారు. ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాన్ చీఫ్ గెస్టుగా హాజరవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X