చిరు మేనల్లుడి సినిమా పరిస్థితేంటి?
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజను హీరోగా పరిచయం చేస్తూ 'రేయ్' అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మ్యూజికల్ లవ్ స్టోరీ ఈ చిత్రం రూపొందుతోంది. వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో అప్పుడెప్పుడో 2010లో ప్రారంభైమన ఈ చిత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ అమెరికాలో ప్రారంభం అయింది. సాన్‌ఫ్రాన్సిస్కోలో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే 'రేయ్' ఈచిత్రానికి సంబంధించిన కొంత భాగాన్ని లాస్ వెగాస్, అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో పర్మినెంట్ రోల్ పోషిస్తోంది.
వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ మధ్య చిత్రం రద్దయినట్లు వార్తలు వచ్చినా అవన్నీ అవాస్తవమని తేలింది. ఇలా పడుతూ లేస్తూ సాగుతున్న మెగా మేనల్లుడి సినీరంగ ప్రవేశం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











