మెగాస్టార్, పవర్ స్టార్‌ల మిక్స్...(రేయ్ AటుZ లుక్)
హైదరాబాద్: వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చే 'రేయ్' చిత్రం ద్వారా మెగస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు వైవిఎస్ వినూత్న రీతిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన A టు Z లుక్ విడుదల చేసారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో.....'రేయ్' సినిమాలో సాయి ధరమ్ తేజ్ అలా కనిపిస్తారు అని ప్రచారం చేస్తున్నారు వైవిఎస్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన A టు Z లుక్‌లో కూడా ఇవే విషయాలను పొందు పరిచాడు దర్శకుడు.
A టు Z విడుదల కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన చేతుల మీదుగా A టు Z లుక్ విడుదల చేసారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

అల్లు అర్జున్
సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రేయ్' చిత్రం A టు Z లుక్ విడుదల చేస్తున్నస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

చిరంజీవిలా ఉంటాడు
రిలీజ్ అయిన ‘రేయ్' ప్రెస్ స్టిల్స్ చూసి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి సాయిధరమ్ తేజ్ స్టిల్స్‌లో నాలాగే ఉన్నాడని చెప్పాడట. ఆ స్టిల్ష్ చూసిన వారంతా సాయి ధరమ్ తేజ్ మెగాస్టార్‌లా ఉన్నాడని ప్రశంసించారట.

మెగాస్టార్, పవర్ స్టార్ సాంగ్ రీమిక్స్
రాజు సుందరం కొరియోగ్రఫీలో మెగాస్టార్ సాంగ్ గోలీమార్, పవర్ స్టార్ సాంగ్ చికిత్తాస్‌ల వెరైటీ రీమిక్స్ సాంగ్ చిత్రీకరణ దృశ్యం.

పవర్ స్టార్ పాంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్', ‘బాలు' సినిమాల్లో ఆయన వాడిని పాంట్స్‌ని సాయి ధరమ్ తేజ్‌కు వాడమని ఇచ్చారట.

పవర్ స్టార్ ఇన్ఫిరేషన్
రేయ్ సినిమా తీయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్ఫిరేషన్ అంటూ ఏర్పాటు చేసిన పోస్టర్‌ను చూపుతున్న దర్శకుడు.

సెక్సీ ఫోటో షూట్
రేయ్ సినిమాలోని హీరో హీరోయిన్ల ఫోటో సెషన్ దృశ్యాలను పరిశీలిస్తున్న అల్లు అర్జున్.

రేయ్ A టు Z లుక్
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో ‘రేయ్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరో హీరోయిన్లు.

ఆలస్యం అయింది
2010 అక్టోబర్ దసరాకి ప్రారంభమైన ఈ సినిమా చాలా కారణాల వల్ల ఆలస్యమైంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని సినిమాని పూర్తి చేసాం. నమ్మిన సిద్ధాంతం మంచిదైతే ఏ పని మధ్యలో ఆపకూడదు అనే ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, నేను జయాపజయాలను పట్టించుకోను అనే పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సినిమా పూర్తి చేసాను అన్నారు.

విడుదల ఎప్పుడంటే
హీరో సాయి ధరమ్ తేజ్ పూనాదిరాళ్లు సినిమాలో చిరంజీవిగారిలా కనిపించారు. ఫైట్ష్, డాన్స్ చాలా ఎనర్జిటిక్‌గా చేసారు. శ్రద్ధాదాస్ నెగటివ్ రోల్ చేసింది. చక్రి అద్భుతమైన సంగీతం అందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేస్తాం అన్నారు.

యూత్ టార్గెట్
'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











