'నాట్ ఎ లవ్ స్టోరి' అంటూ మాట మార్చిన రామ్ గోపాల్ వర్మ

By Srikanya

ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ తాను లవ్ స్టోరి అనే టైటిల్ తో ఓ చిత్రం తీయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఇఫ్పుడా టైటిల్ ని మార్చనున్నారు.నాట్ ఎ లవ్ స్టోరి అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.ట్విట్టర్ లో ఈ విషయం తెలియచేసారు. మహిగిల్ అనే బాలీవుడ్ హీరోయిన్ తో ఆయన ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారు.లేడి ఓరియెంటెడ్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.హిందిలో మొదట చిత్రీకరించి ఆ తర్వాత దాన్ని తెలుగు,తమిళ బాషల్లో డబ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.మొదట ఆయన భారీ బడ్జెట్ తో డిపార్టమెంట్ చిత్రం ప్లాన్ చేసారు.కానీ దాన్ని పెండింగ్ పెట్టి ఈ ప్రాజెక్టుని భుజాన ఎత్తుకున్నట్లు చెప్తున్నారు.

ముంబయిలో మారియా సుసైరాజ్ అనే యువతి తన ప్రియుడితో కలిసి ఓ వ్యక్తిని చంపి, శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, కిరోసిన్‌తో తగలపెట్టిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఇందులో మారియా సుసైరాజ్ పాత్రను 'దేవ్ డి' నటి మహీ గిల్‌ను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు.

ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ..జీవితంలో చాలా సంఘటనలు మనల్ని కదిలిస్తాయి. భయపెడతాయి. 2008లో ముంబైలో జరిగిన ఓ హత్య నన్ను భయపెట్టింది. ఇద్దరు ప్రేమికులు ఓ వ్యక్తిని కిరాతకంగా చంపి...ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మాయం చేయడానికి ప్రయత్నించారు. ఆ హత్య వెనుక రహస్యాలను చేధిస్తే ఓ గొప్ప ప్రేమకథ ఉంది. ఆ కథనే సినిమాగా తీస్తున్నా. 'దేవ్‌ డి'లో నటించిన మహిగిల్‌ని ఓ పాత్ర కోసం ఎంచుకొన్నాం. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని ఆయన చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X