న్యూడ్ సీన్ గురించి రామ్ గోపాల్ వర్మ ఇలా...!
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ 'ఐస్ క్రీమ్' సినిమా ద్వారా తేజస్వి హీరోయిన్‌గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజస్వి ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూడ్‌గా నటించడంతో సినిమాకు ఒక్కసారిగా హైప్ పెరిగింది. అయితే ఈ న్యూడ్ సీన్ గురించి వర్మ తనదైన రీతిలో విశదీకరించారు.
'మన సెన్సార్ రూల్స్ ప్రకారం మన సినిమాల్లో ఓ అమ్మాయిని న్యూడ్ గా చూపించలేం. మేము ఈ సినిమాలో ఫ్లో కామ్ టెక్నాలజీ వాడడం వలన న్యూడ్ సీన్ ఎఫెక్ట్స్ బాగా ఆసక్తిగా వచ్చాయి. అది ఎలా ఉందా అనేది మీరు స్క్రీన్ మీద చూసే తెలుకోవాలి' అని వెల్లడించారు.

ఇక తేజస్వి తన సినిమాలోకి ఎలా వచ్చిందనే అంశంపై స్పందిస్తూ...ముంబైలో హార్ట్ ఎటాక్ సినిమా షూటింగ్ సందర్భంగా తొలిసారిగా ఆమెను చూసాను. విష్ణు సినిమాలో ఓ అతిధి పాత్ర కోసం ఎవరైతే బాగుంటుందా అని పూరిని అడిగితే తను తేజస్విని సజెస్ట్ చేసాడు. తనని షూటింగ్ స్పాట్ లో చూసిన నేను తనే ఐస్ క్రీమ్ సినిమాలో హీరోయిన్ అని ఫిక్స్ అయ్యాను అన్నారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయిని చుట్టూ కథ నడిపిస్తూ ఓ కొత్త కాన్సెప్ట్ చెప్పడానికి ట్రై చేసాను, నా వరకూ నేను సక్సెస్ అయ్యాను. ఇక ఈ సినిమా నచ్చడమా లేదా అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది అన్నారు. ఫ్లో కామ్ టెక్నాలజీ లాంటి సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











