twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV నేను మగాడిని.. అందుకే ఆ ఇద్దరితో అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు

    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సెన్సేషనల్, యూనిక్ సబ్జెక్ట్స్‌తో డేంజరస్, కొండా లాంటి ఆయన రూపొందించే పనిలో ఉన్నారు. ఆయన రూపొందించిన పలు చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకటి డేంజరస్. డేంజరస్ చిత్రం స్వలింగ సంపర్కం నేపథ్యంగా రూపొందిన తొలి లెస్బియన్ చిత్రంగా ఓ రికార్డును నమోదు చేసుకొన్నది. అయితే ఈ సినిమా గురించి, లెస్బియన్ కాన్సెప్ట్ గురించి, అలాగే క్రిప్టో కరెన్సీ మోడల్‌లో చేసిన బిజినెస్ గురించి వర్మ మాట్లాడుతూ..

    ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్, సెక్స్

    ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్, సెక్స్

    ఇప్పటి వరకు తెర మీద ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ఉండే ప్రేమ కథలను చూశాం. అయితే ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ ఉండి.. సెక్స్ లైఫ్‌ను పంచుకొంటే ఎలా ఉంటుందనే ఆలోచన ద్వారా డేంజరస్ సినిమాను రూపొందించాను. లెస్బియన్స్‌కు ఈ సినిమా ద్వారా ఎల్జీబీటి సమాజానానికి ఓ సందేశం ఇవ్వబోతున్నాం అని వర్మ చెప్పారు.

    లెస్బియన్ కాన్సెప్ట్‌కు నా సపోర్ట్

    లెస్బియన్ కాన్సెప్ట్‌కు నా సపోర్ట్

    లెస్బియన్ చిత్రంగా రూపొందిన డేంజరస్ మూవీలో ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ ఉంటుంది. సెక్స్ ఉంటుంది. ప్రేమలో ఉన్న వ్యక్తులకు తర్వాత డెస్టినేషన్ సెక్స్ అనేది నా ఒక్కడి అభిప్రాయం కాదు.. అందరి అభిప్రాయం. నేను లెస్బియన్స్‌ కాన్సెప్ట్‌కు నా మద్దతు ఉంది. సమాజంలో బతికే వారిని మన కంటే తక్కువగా చూడకూడదు. మన బతుకు మనం బతుకుతున్నాం. వాళ్లను వాళ్ల బతుకును సాగించేందుకు సపోర్ట్ చేయాలి అని వర్మ అన్నారు.

    నేను మగాడిని కాబట్టే..

    నేను మగాడిని కాబట్టే..

    ఇద్దరు మహిళల మధ్య ప్రేమను చూపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే.. నేను మగాడిని. అందుకే ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ, సెక్స్ అంశాలను జోడించి సినిమాను తీశాను. నా దృష్టిలో అమ్మాయి, అబ్బాయి మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుందో.. ఇద్దరు అమ్మాయిల మధ్య అలాంటి ప్రేమ ఉంటుంది. ప్రేమ విషయంలో నాకు ఎలాంటి అభిప్రాయలు లేవు అని వర్మ అన్నారు.

    డేంజరస్ సినిమా ఎలా ఉంటుందంటే..

    డేంజరస్ సినిమా ఎలా ఉంటుందంటే..

    గతంలో ఇద్దరు మహిళల మధ్య శృంగార జీవితం గురించి ఫైర్, గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమాలు వచ్చాయి. డేంజరస్ సినిమా అలాంటి సినిమా కాదు. ఈ సినిమా అనగనగా ఒకరోజు సినిమా మాదిరిగా ఉంటుంది. లవ్, సెక్స్‌తోపాటు క్రైమ్ కూడా ఓ అంశంగా ఉంటుంది అని వర్మ చెప్పారు.

    క్రిప్టో కరెన్సీ మోడల్‌లో

    క్రిప్టో కరెన్సీ మోడల్‌లో

    డేంజరస్ సినిమాను కొత్త బిజినెస్ మోడల్‌లో రిలీజ్ చేస్తున్నాం. క్రిప్టో కరెన్సీ విధానంలో నాన్ ఫంగిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్‌టీ) బిజినెస్ మోడల్‌లో తొలిసారి డేంజరస్ సినిమాను బిజినెస్ చేస్తున్నాం. ద్రవ్య విధానంలో బార్టర్ సిస్టమ్, గోల్డ్, కరెన్సీ, డిజిటల్ మనీ లాంటి అంశాలు కీలకంగా మారాయి. ఈ సమాజంతో భాగమయ్యాయి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొందరు పారిశ్రామిక దిగ్గజాలు వాళ్లకంటూ ఓ కరెన్సీ రూపొందించుకొని వ్యాపారం చేసుకొంటున్నారు. డేంజరస్ సినిమాను ఎన్‌ఎఫ్‌టీ అనే క్రిప్టో కరెన్సీ బిజినెస్ విధానంలో రిలీజ్ అవుతుంది.

    Recommended Video

    Allu Arjun వేరు.. మెగా హీరోలు వేరు - RGV | Pushpa Raj అందుకే మిస్ || Filmibeat Telugu
    ఎన్‌ఎఫ్‌టీ ద్వారా సినిమా అమ్మకం

    ఎన్‌ఎఫ్‌టీ ద్వారా సినిమా అమ్మకం

    ఎన్ఎఫ్‌టీ పద్దతిలో బిజినెస్ ఎలా ఉంటుందంటే.. డేంజరస్ సినిమా రేటును 100 యూనిట్లుగా విభజించి అమ్మడానికి ప్రయత్నిస్తాం. ట్రైలర్ చూసి ఎవరైనా 5 గానీ, 10 గానీ లేదా వారికి ఇష్టం వచ్చినంతగా యూనిట్లు కొనుగోలు చేసుకోవచ్చు. అలా ఒక సినిమాకు ఈ బిజినెస్ మోడల్‌లో అనేక మంది నిర్మాతలు, సహ నిర్మాతలు ఉండవచ్చు. వారు సినిమాపై వచ్చిన రెవెన్యూను పంచుకొంటారు. ఈ సినిమాను ట్రిక్కీ మీడియా రిలీజ్ చేస్తున్నది అని వర్మ తెలిపారు.

    English summary
    Popular Director RGV is coming with Dangerous movie. This is the first lesbian movie. This movie also releasing in NFT, Crypto Currency model.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X