For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్‌‌కు కొడుకు పుట్టడంపై.... రామ్ గోపాల్ వర్మ కామెంట్!

  By Bojja Kumar
  |
  "The Dad Is Looking Unimaginably Cute." RGV FB Post On Pawan Kalyan

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తండ్రయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుండి తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో దీని గురించే ఎక్కువ చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు లక్షల సంఖ్యలో స్పందిస్తుండటంతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది.

  పవన్ కళ్యాణ్‍‌కు ఇది నాలుగో సంతానం. ఇప్పటికే ఆయనకు మాజీ భార్య రేణు దేశాయ్ ద్వారా అకీరా నందన్, ఆద్యా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అన్న లెజెనివాను పెళ్లాడిన పవర్ స్టార్ పోలెనా అనే కూతురుకు జన్మినిచ్చారు. ఈ దంపతులకు తాజాగా మరో కుమారుడు జన్మించాడు.

   రామ్ గోపాల్ వర్మ కామెంట్

  రామ్ గోపాల్ వర్మ కామెంట్

  పవన్ కళ్యాణ్‌కు కొడుకు పుట్టడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘ఊహకు అందనంత క్యూట్‌గా ఉన్న కొడుకును చూస్తున్న తండ్రి..' అంటూ ఓ ఫోటో పోస్టు చేసి కామెంట్ పెట్టారు.

  కొన్ని గంటల ముందు ఇజం గురించి పోస్ట్

  కొన్ని గంటల ముందు ఇజం గురించి పోస్ట్

  తండ్రయిన పవన్ కళ్యాణ్‌ను విష్ చేసిన పవన్ కళ్యాణ్... అంతకంటే కొన్ని గంటల ముందు పవనిజం గురించి ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ పవనిజం మీద రిలీజ్ చేసిన ‘ఇజం' అనే పుస్తకం చదివిన అనంతరం వర్మ ఓ లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అప్పట్లో ఆ విషయం హైదరాబాద్ టైమ్స్‌లో కూడా ప్రచురితం అయింది. దాన్ని తాజాగా మరోసారి ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. ఆ లేఖలోని వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

   ఇజం పుస్తకం గురించి మాట్లాడే ముందు...

  ఇజం పుస్తకం గురించి మాట్లాడే ముందు...

  మీరు రాసిన 'ఇజం' పుస్తకం గురించి మాట్లాడే ముందు, మీకు ఒక విషయం చెప్పాలి. రాజకీయ పార్టీని పెట్టాలనే మీ ఐడియాను నేను చాలా కాలంగా గమనిస్తూనే ఉన్నా. మీలో ఉన్న నిజాయతీ నన్ను ఎప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంది. జనసేన పార్టీ ప్రారంభించిన సమయంలో మీ ప్రసంగం నన్ను ఎంతో ఆకట్టుకుంది.... అంటూ వర్మ లేఖలో ఉంది.

   అపుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను

  అపుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను

  మీ ఇజం పుస్తకం లాంచ్ అవుతోందని విన్నప్పుడు నేనెంతో ఎక్సైట్ మెంట్ కు గురయ్యా. చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం అలవాటు. నేను విజయవాడలో ఇంజినీరింగ్ చదివేటప్పుడు ఇమ్మాన్యుయేల్, ఆర్థర్ స్కోపెన్ హ్యూయర్, డెస్కార్టెస్, విలెమ్ హేగల్, ఫ్రెడ్రిచ్ నీష్, బరూచ్ స్పినోజా, రాండ్ ల పుస్తకాలను చదివా. ఆ తర్వాత పలువురు ఆధునిక తత్వవేత్తల పుస్తకాలను చదివా. సమాజాన్ని ఎలా మార్చాలన్న అంశంపై వీరు ఎంతో లోతుగా ఆలోచించారు.

  నేను ఆశించినట్లుగా లేదు

  నేను ఆశించినట్లుగా లేదు

  వీరి ఆలోచనా విధానానికి కొనసాగింపు మీ ఇజం పుస్తకంలో ఉంటుందని నేను ఆశించా. సమాజం పట్ల మీలో ఉన్న తపన, మీకు ఉన్న అవగాహన తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని... నేను ఆ విధంగా ఆశించాను. కానీ, ఇజం పుస్తకాన్ని చదివిన తర్వాత... గ్రేట్ సోషియల్ ఫిలాసఫీలను మీ సహ రచయిత రాజు రవితేజ్ ఓ ఎలిమెంటరీ స్కూలు పిల్లాడి మాదిరిగా అర్థం చేసుకున్నాడని నాకు అనిపించింది. నేను రాజు రవితేజ్ గురించే ముందు ఎందుకు మాట్లాడుతున్నానంటే... ఇజం పుస్తకానికి సంబంధించి పుస్తక రచయితగా ఎక్కువ క్రెడిట్ రాజు రవితేజ్ కే దక్కుతుంది. ఇజం పుస్తకం సమాజానికి సంబంధించినది కాబట్టి... దీనికి సంబంధించి నా విశ్లేషణను బహిరంగంగా చెప్పాను.

   అలాంటివి మళ్లీ వాడుకోండి

  అలాంటివి మళ్లీ వాడుకోండి

  ఇజం పుస్తకంలో మీరు చెప్పిన దానికన్నా ఎక్కువ జ్ఞానం మీకుంది. మీ ప్రసంగాలు, మీ మాటలు, మీ హావభావాల ద్వారా ఇది నాకు అర్థమవుతోంది. పాత చింతకాయ పచ్చడి లాంటి ఫిలాసఫీలు తప్పుడు సిద్ధాంతాలను కూడా తెరపైకి తెచ్చాయి. అలాంటి వాటిని మీరు మళ్లీ వాడుకోవడం అనవసరం. ఆర్థర్, ఇమ్మాన్యుయేల్ ల పుస్తకాలను మీరు చదవలేదని నాకు అర్థమవుతోంది. మీరు పూర్తిగా మీ ప్రైమరీ రైటర్ రాజు రవితేజ్ పైనే ఆధారపడ్డారు.

   లక్ష్యాలను తాకే విధంగా లేదు

  లక్ష్యాలను తాకే విధంగా లేదు

  ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. పాత ఫిలాసఫీలు అన్నీ ఆధునిక సమాజ నిర్మాణంలో పూర్తిగా వాడుకోబడ్డాయి. ఇప్పుడు వాటి అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది 100 శాతం పవనిజం మాత్రమే. మీ తొలి ప్రసంగంలో మీరు చెప్పిన లక్ష్యాలను తాకే విధంగా ఇజం పుస్తకంలో 90 శాతం లేదు.

  అలా అనుకోకూడదు

  అలా అనుకోకూడదు

  బ్రూస్ లీ ఒక ఫైటరే కాదు. ఒక ఫిలాసఫర్ కూడా. జ్ఞానం అనేది పైకి ఎక్కడానికి ఉండే నిచ్చెన మెట్లులా ఉండాలని బ్రూస్ లీ ఒకానొక సమయంలో చెప్పాడు. కానీ, మనం ఎక్కిన ప్రతి మెట్టును మనం సేకరించుకుంటూ పోతే... ఒకానొక రోజు మెట్ల బరువు మనల్ని మరింత పైకి ఎక్కనివ్వకుండా అడ్డుకుంటుంది. నిన్ను ఏదైతే ముందుకు తీసుకెళుతుందో... దాన్ని నీతో తీసుకుపోవాలని అనుకోకూడదు. హేయ్ పవన్... నేను బ్రూస్ లీ గురించి ఎందుకు చెప్పానంటే... ఆయనలోని తీవ్రత, చిత్తశుద్ధి మీలో కూడా ఉన్నాయి. బ్రూస్ లీ శైలి ప్రత్యేకమైనదిగా ఎందుకు నిలిచిపోయిందంటే... ఇతరుల వల్ల ప్రభావితం కాకుండా తనను తాను కాపాడుకున్నాడు కాబట్టి.

   మీ ఇజం పుస్తకంతో నేను చాలా నిరాశ చెందా

  మీ ఇజం పుస్తకంతో నేను చాలా నిరాశ చెందా

  మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే వ్యక్తపరుస్తున్నారో... అదే మీ సొంత ఫిలాసఫీగా ఉండాలి. మిమ్మల్ని ఆరాధించే వ్యక్తిగా, మీ శ్రేయోభిలాషిగా మీకు ఇదంతా చెబుతున్నా. చివరగా ఓ మాట. మీ ఇజం పుస్తకంతో నేను చాలా నిరాశ చెందా. కానీ, పవనిజం మీద మాత్రం నాకు ఇంకా నమ్మకం ఉంది"

  English summary
  "The Dad is looking unimaginably cute." RGV FB post on Pawan Kalyan's new born son.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X