పోర్న్ ఒక్కటే తెలుసు.. నా లాగా ఆ విషయంలో సున్నా అయితే ఇలా చేయండి.. RGV పాట్లు!
పవర్ స్టార్ సినిమాకు ఏ స్థాయిలో లాభాలు అందుతాయో తెలియదు గాని సినిమాను జనాలు ఎలాగైనా చూడాలని వర్మ పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస కాంట్రవర్సీ కామెంట్స్ తో సినిమాకు హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇటీవల నిరక్షరాస్యత ఉన్న వాళ్లకు, టెక్నాలజీ మీద అవగాహన లేని వారికి సినిమా ఎలా చూడలో ఒక వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది.

నా గురించి అందరికి తెలుసు
సాధారణంగా ఏ విషయం చెప్పినా కూడా వర్మ ముందు తనను తాను కూడా తిట్టేసుకోవడానికి రెడీ అవుతాడు. ప్రస్తుతం తనపై వస్తున్న సినిమాలపై కూడా వర్మ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే నేను అవన్నీ పట్టించుకోనని అనేశాడు. ఎందుకంటే తన గురించి అందరికి తెలుసని ఏం చెప్పినా కూడా బహిరంగంగానే చెప్పేస్తానని అలాంటప్పుడు సినిమాల్లో చెప్పడానికి ఏమి ఉంటుందని అన్నారు

పవర్ స్టార్ సినిమా చూడాలి అంటే..
ఇక పవర్ స్టార్ సినిమా కోసం ఓ వర్గం వారు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పిన ఆర్జీవి నిరక్షరాస్యులు, టెక్నాలజీ మీద అవగాహన లేని వారి పవర్ స్టార్ సినిమాను ఎలా చూడాలనే విషయంపై ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. తనకు కూడా టెక్నాలిజి మీద ఏ మాత్రం అవగాహన లేదని అంటు ఈ విధంగా వివరణ ఇచ్చాడు.

కేవలం పార్న్ వెబ్ సైట్స్..
RGV మాట్లాడుతూ.. నన్ను అందరు మంచి టెక్నీషియన్ అని అంటారు. కానీ అది మేకింగ్ వరకే. టెక్నాలజీ మీద నాకు సున్నా అవగాహన ఉంది. కేవలం పార్న్ వెబ్ సైట్స్ కోసమే నేను వెబ్ సైట్స్ చూస్తాను. అయితే పవర్ స్టార్ సినిమా చూడాలని అనుకునే కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వవచ్చు. వారి కోసమే ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నాను.

ఇష్టం ఉంటేనే చూడండి..
ఆర్జీవి వరల్డ్ వెబ్ సైట్ లోకి వెళ్లి పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన పేమెంట్స్ చేసి ఈ విధంగా సినిమా చూడవచ్చు అని వర్మ వీడియోలో వివరణ ఇచ్చారు. అయితే ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఇష్టం ఉంటేనే సినిమా చూడండి అంటూ.. ఇష్టం ఉన్నా టెక్నాలజీ మీద అవగాహన లేకపోతే ఇలా చేయండి లేదా ఎవరైనా హెల్ప్ తీసుకొండని వర్మ వివరణ ఇచ్చాడు. దీన్ని బట్టి వర్మ పవర్ స్టార్ సినిమాను ఎంతగా ప్రమోట్ చేస్తున్నాడో అర్థం చెసుకోవచ్చు.
View this post on InstagramMe talking about how to do advance booking and watch POWER STAR in rgvworldtheatre.com on 25th 11 Am
A post shared by RGV (@rgvzoomin) on


Click it and Unblock the Notifications











