twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి ఓ యువతి జీవితమే మా సినిమా: వర్మ

    By Srikanya
    |

    Psycho
    హైదరాబాద్ : కొన్నాళ్ల క్రితం నాకు తెలిసిన అమ్మాయి ఫోన్‌ చేసింది. ఓ అబ్బాయి తనను వేధిస్తున్నాడని చెప్పేది. ఏమైనా చేద్దామంటే ఆమెకు నేను బంధువును కాను. ఆ అమ్మాయి పరిస్థితి తెలిసీ ఏమి చేయలేకపోయాను. అలాంటి ఓ యువతి జీవితమే మా సినిమా అన్నారు రామ్‌గోపాల్‌వర్మ.

    రామ్‌గోపాల్‌వర్మ అందించిన కథ, స్క్రీన్‌ప్లేతో రూపొందిన చిత్రం 'సైకో'. నిషా కొఠారి ప్రధాన పాత్రలో నటించింది. కిషోర్‌ భార్గవ్‌ దర్శకుడు. వివేకానంద అహుజా నిర్మాత. ఈ నెల 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

    అలాగే ''కొన్ని సినిమాలు వినోదం కోసం చేశాను. మరికొన్ని వాణిజ్య అంశాలను దృష్టిలో ఉంచుకొని తీశాను. ఇంకొన్ని ఊరికే తీశాను. కానీ ఈ చిత్రం మాత్రం ఓ వాస్తవ సంఘటనకు స్పందించి తీశాను. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలపై యాసిడ్‌ దాడులు, హత్యాప్రయత్నాలు నిత్యకృత్యమైపోయాయి. అమ్మాయిల వెంట అబ్బాయిలు ప్రేమ అంటూ వెంటపడి.. ఆమె అంగీకరించకపోయేసరికి విపరీతంగా ప్రవర్తిస్తూ సైకోగా మారుతున్నారు.

    అయితే దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ముందు జాగ్రత్తగా మనం మేల్కోవాల్సిందే. అలాంటి వారిని వాళ్ల కుటుంబ సభ్యులే గమనించాలి. ఈ సినిమాలో ఇలాంటి ఓ సైకో గురించి.. దానికి పరిష్కారాన్ని చూపించాం. అయితే ఇదే పరిష్కారం అందరికీ వర్తించకపోవచ్చు. ఈ సినిమా చూసే ప్రతి అమ్మాయి తెరపై తనని తాను చూసుకుంటుంది. అమ్మాయిలు తప్పక చూడాల్సిన చిత్రమిది'' అన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నటి జియాఖాన్‌ జీవితం ఆధారంగా సినిమా తీసే ఆలోచన ఉందని తెలిపారు వర్మ.

    English summary
    After the success of 'The Attacks Of 26/11', Ramgopal Varma is working on another project. He said to be providing the story for a film titled 'Psycho'. He is introducing Kishore Bharghav as the director with this film. Nisha Kotari is playing the lead character and Caliber films is producing this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X