కట్టప్ప వెన్నుపోటు కల్పితం.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నిజం: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వెనక అసలు నిజం ఇదే!

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయడం వెనక ఉన్న అసలు కారణం ప్రజలకు చెప్పాలని ఎన్టీ రామారావుగారు తనను అడిగారని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన వాయిస్ మెసేజ్ యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు.

ఎన్టీఆర్ గారు 1989 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి, అధికారం కోల్పోయిన సమయమిది. ఆయన కుటుంబీకులు, పార్టీ వారు ఆయన్ను ఏకాకిగా వదిలేసిన సమయంలో లక్ష్మీ పార్వతి అనే స్త్రీ ఆయన జీవితంలోకి ప్రవేశించింది. ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన సంబంధం ఆంధ్రప్రదేశ్ రాజకీయ రూపురేఖలను అతలాకుతలం చేసేసి పర్మినెంటుగా ఎలా ఒక చెరగని ముద్రను వేసింది అనేదే ఈ సినిమా సారాంశమని తెలిపారు.

వారి అసలు వికార నగ్నత్వాన్ని అందరికీ చూపెట్టడమే

వారి అసలు వికార నగ్నత్వాన్ని అందరికీ చూపెట్టడమే

ఈ సినిమా ఉద్దేశ్యం పాతిక సంవత్సరాల నుంచి నిజాలుగా చెలామణి అవుతున్న సిగ్గులేని అబద్దాలను శాశ్వాతంగా నిజం అనే ఒక గోతిలో పాతిపెట్టడం. రాజకీయ మోసగాళ్ల మొహాలమీద ముసుగులుతీసి వారి అసలు వికార నగ్నత్వాన్ని అందరికీ చూపెట్టడమే అన్నారు.

ఎన్టీఆర్ చివరి రోజుల్లో బోరుబోరున ఏడ్చారు

ఎన్టీఆర్ చివరి రోజుల్లో బోరుబోరున ఏడ్చారు

అలాగే ఆమెతో ఆయన సంబంధం వెనక ఉన్న రహస్యం, వైస్రాయ్ ఉదంతం వెనక ఉన్న అత్యంత నీచమైన కుట్రలు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో బోరుబోరున ఏడ్చి పడిన కుమిలిపాటిని కూడా ఈ చిత్రం సవివరంగా ఈ చిత్రం చూపెడుతుంది.

మోసం అనే విషం పూసి వెన్నుపోటు కత్తితో పొడిచి చంపారు

మోసం అనే విషం పూసి వెన్నుపోటు కత్తితో పొడిచి చంపారు

ఎన్టీఆర్ గారిని మోసం అనే విషం పూసి వెన్నుపోటు కత్తితో పొడిచి చంపారు. ఆ మహామనిషి ఎన్టీఆర్ గారి చావుకు కారణమైన ప్రతి ఒక్కరినీ ప్రజా కోర్టులో నిలబెట్టడానికి మీ అభిమాన థియేటర్లలో ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ప్రపంచం యావత్తూ ఉన్న తెలుగు ప్రజలే ఈ చిత్రానికి న్యాయ నిర్ణేతలు.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది కల్పితం

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది కల్పితం

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది కల్పితం.. ఆ అందరూ ఎన్టీఆర్‌ను ఎందుకు వెన్నుపోటు పొడిచారు అన్నది యదార్థం.

-స్వర్గంలో ఉన్న అన్నగారి ఆశీస్సులతో మీ రామ్ గోపాల్ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X