మహేష్ కు కూడా టిక్కెట్ట్ దొరక లేదు

By Srikanya

బిజినెస్ మ్యాన్ కు ఎక్సట్రీమ్ హైట్స్ క్రేజ్ ఫ్యాన్స్ ఏమిటంటే...మహేష్ బాబు కూడా ఈ చిత్రం టిక్కెట్ సంపాదించుకోలేకపోయారు అంటూ ప్రముఖ దర్సకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ట్వీట్ చేసారు. అలాగే ఇది బిజినెస్ మ్యాన్ కాదు..ఇది బిజినెస్ మ్యానియా అన్నారు. ఇక నిన్న కూడా ఆయన ఈ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ... రేపు అంటే జనవరి 13న పెద్ద సునామీ ఆంధ్రప్రదేశ్ ని తాకబోతోందని వార్త. దాని పేరు బిజినెస్ మ్యాన్ అని ట్వీట్ చేసారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రానికి వర్మ కాన్సెప్టుని ఇచ్చారు. ఈ విషయాన్ని పూరీనే స్వయంగా చెప్పారు.

ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..'బిజినెస్‌ మేన్‌'. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్‌ వర్మ నుంచి ఫోనొచ్చింది. ఆయన మాటల్లో 'దావుద్‌ ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలీదు, ఛోటా రాజన్‌ హల్‌చల్‌ లేదు, ఛోటా షకీల్‌ కూడా లేడు.... మైదానం ఖాళీ ఉంది. ఎవడైనా వచ్చి ఆడుకోవచ్చు...' అన్నారు. ఆ ఆలోచన నాలో నాటుకుపోయింది. వెంటనే ఈ కథ అల్లుకొన్నాను అన్నారు పూరీ జగన్నాధ్. ఇక నిజానికి బిజినెస్ మ్యాన్ టైటిల్ తో సూర్య హీరోగా వర్మ ఈ చిత్రం చేద్దామని ప్రకటన ఇచ్చారు. అయితే ఆ తర్వాత రక్త చరిత్ర పార్ట్ 2 ప్లాప్ కావటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అయితే ముంబైలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతూండటంతో పూరీ ...ఆయనతో టచ్ లోనే ఉంటూ వచ్చారు. అది చూసి చాలామంది మహేష్,వర్మ కాంబినేషన్ లో సినిమా కూడా వస్తుందని బావించారు. ఇక ఈ రోజు విడుదల అయ్యే బిజినెస్ మ్యాన్ పరిస్దితిని బట్టి వర్మ నెక్ట్స్ ట్వీట్ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X