'బెజవాడ రౌడీలు' టైటిల్ మార్చటానికి ఓకే అన్న రామ్ గోపాల్ వర్మ
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ దిగివచ్చారు. బెజవాడ జనం గగ్గోలు పెడుతున్న టైటిల్ విషయమై ఆయన బిగి సడలించారు. వారు నిరసనలకు దిగివచ్చి 'బెజవాడ రౌడీలు' సినిమా పేరు మార్చటానికి ఒప్పుకున్నాడు. ఈ విషయాన్నీ ఆయనకు సన్నిహితుడైన యం పి లగడపాటి రాజగోపాల్ స్వయంగా తెలియచేసారు. రామ్ గోపాల్ వర్మ తన చిత్రం పేరులో 'బెజవాడ' అనే పేరు లేకుండా చూసుకుంటానని తనకు మాట ఇచ్చాడని రాజగోపాల్ మీడియా తో మాట్లాడుతూ చెప్పారు. ఈ నిర్ణయం పట్ల విజయవాడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇటివలే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ, కోనేరు కిరణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో వివేక్ కృష్ణ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య, జెనిలియా జంటగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కు విడుదల కానుంది. ఇంతకీ ఈ చిత్రానకి ఏం టైటిల్ పెట్టనున్నాడనే విషయం ఇప్పుడు చర్చగా మారింది. ఇక ఏ టైటిల్ పెట్టినా జనం మాత్రం పాపులర్ అయిన బెజవాడ రౌడీలు అనే దానితో వ్యవహరిస్తారనేది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications











