twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరి నిమిషంలో వీడిన ఉత్కంఠ.. రేపే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు

    |

    అసలు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే చిత్రం రిలీజవుతుందా లేదా? ఈ మూవీ విడుడదల చేయడానికి ఆర్జీవీకి లైన్ క్లియరైనట్టేనా? రేపు (డిసెంబర్ 12) రిలీజ్ అంటూ ప్రకటించి ఇంకా ఏమిటీ గోల.. అభ్యంతరం చెప్పిన టైటిల్‌నీ మార్చేశారు. ఇక సెన్సార్ అభ్యంతరాలు పరిశీలించేందుకు రివైజింగ్ కమిటీకీ వెళ్లారు. అయినా ఇంకా కొన్ని ప్రశ్నలకు బదులే దొరకడం లేదు. వర్మకు మరో షాక్ తగిలేట్టు కనిపించినా.. తాజాగా అందిన సమాచారం మేరకు చివరకు ఉత్కంఠ వీడిందని తెలుస్తోంది.

    వివాదాలతో సావాసాలు..

    వివాదం సృష్టించడానికే అన్నట్టు ఎవ్వరూ టచ్ చేయని కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ.. అందర్నీ నోళ్లలో నానుతాడు. సినిమాను ప్రమోట్ చేయడం ఎలాగూ, టైటిల్‌తోనే గొడవలు ఎలా పెట్టగలడో అనే వాటిపై రీసెర్చ్ చేసినట్టుకనిపిస్తోంది. ఆర్జీవీ తాజా చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే చిత్రం ఆయన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది.

    సెన్సార్ బోర్డు, హైకోర్టుల చుట్టూ..

    అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం పిటీషన్‌ను విచారించిన హైకోర్టు.. ఇంకా రివైజింగ్ కమిటీ, సెన్సార్ బృందం చేతిలోనే ఉందని వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ వాళ్లు తాత్సారం చేశారని చిత్ర యూనిట్ స్వయంగా కోర్టుకు విన్నవించింది. అయితే ఈ పిటీషన్‌పై సెన్సార్ బోర్డు..చిత్ర యూనిట్ సభ్యుల మధ్య వాగ్వాదం నడుస్తోంది.

    మ్యూట్ చేసినా ఓప్పుకోని సెన్సార్..

    చిత్రంలో ఉన్న అభ్యంతరాలు అన్ని తీసేసామని చిత్రయూనిట్ కోర్టుకు విన్నవించుకున్నారు. వాళ్లు చెబుతున్నట్టు ఏదీ తీసి వేసినట్టు ఎక్కడా లేదని కేవలం మ్యుట్‌లో మాత్రమే ఉంచారని సెన్సార్ బృందం వ్యాఖ్యానించింది. అయితే దీనికి కౌంటర్ వాదన వినిపిస్తూ... అలా ఏదీ మ్యూట్ లో ఉంచలేదని కొన్ని సన్నివేశాలను డిలీట్ చేసేసామని చిత్ర యూనిట్ తెలిపింది.

    మరోసారి రివ్యూ కమిటీ..

    మరోసారి రివ్యూ కమిటీ..

    రివ్యూ కమిటీ ఇప్పటికే ఆర్జీవీ యూనిట్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చిందని అడిషనల్ సోలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. రివ్యూ కమిటీ రెండో సారి కూడా చిత్రాన్ని పరీశీలించాల్సి ఉందని .. తొందరగా చూసి నిర్ణయం తెలపాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

    జోక్యం చేసుకోలేమన్న కోర్టు..

    జోక్యం చేసుకోలేమన్న కోర్టు..

    రివ్యూ కమిటీ పరిధిలో ఉందని ఇప్పుడు తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. అన్ని సక్రమంగా ఉన్నట్లయితే రిలీజ్ ఆర్డర్ పాస్ చేయాలని రివ్యూ కమిటిని హైకోర్టు ఆదేశించింది.

    సెన్సార్ పూర్తి..

    అయితే అంతా పరిశీలించిన రివ్యూ కమిటీ కొన్ని సీన్లకు అభ్యంతరం తెలపగా.. వాటిని తొలగించేందుకు సిద్దపడింది. దీంతో సెన్సార్ సభ్యుల సైతం సినిమాకు విడుదలకు ఓకే చెప్పారు. యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్టు తెలుస్తోంది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వాయిదా అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. రేపు యథావిథిగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    All Lines Clear To RGV Amma Rajyam Lo Kadapa Biddalu And IS Releasing on 12th December. RGV Amma Rajyam Lo Kadapa Biddalu Censor Formalities Completed. Sidharth Thatholu Is Directed Amma Rajyam Lo Kadapa Biddalu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X