twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రపంచంలోనే నీ వంటి నటి లేదు.. కంగనాకు క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ

    |

    ఆర్జీవీ, కంగనా రనౌత్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది వ్యవహారం. అలాంటిది తాజాగా ఈ ఇద్దరి మధ్య మంచి సహృదయమైన వాతావరణం నెలకొన్నట్టు కనిపిస్తోంది. నిన్న విడుదల చేసిన కంగనా రనౌత్ ట్రైలర్ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. కంగనా బర్త్ డే సందర్భంగా వదిలిన ఈట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తలైవిపై సినీ ప్రముఖులంతా ప్రశంసలు కురిపించారు.

     అదిరిపోయే డైలాగ్‌లు..

    అదిరిపోయే డైలాగ్‌లు..

    జయలలిత పాత్రలో కంగనా జీవించేసింది. అసెంబ్లీలో చీర లాగే సీన్‌లో జీవించేసింది. ఆ సందర్భంలో వచ్చిన డైలాగ్ కూడా దుమ్ములేచిపోయేలా ఉంది. జయలలితలో ఉండే ఆ మొండిదనం, పట్టుదల, కమాండింగ్ అన్నీ కూడా కంగనా తెరపై చూపించేసింది. ఈ ట్రైలర్‌పై ఆర్జీవీ తన స్టైల్లో స్పందించాడు.

    మైండ్ బ్లోయింగ్‌

    మైండ్ బ్లోయింగ్‌

    ఆ మధ్య బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా, సుశాంత్ సింగ్ మృతిపైనా కంగనా చేసిన కామెంట్లను ఆర్జీవీ తిప్పి కొట్టాడు. కానీ తాజాగా ఆర్జీవీ తలైవిపై ప్రశంసలు కురిపించాడు. 'హేయ్ కంగనా.. కొన్ని కొన్ని విషయాల్లో నేను నీతో ఏకిభవించకపోవచ్చు. కానీ తలైవీ ట్రైలర్‌లో సూపర్ డూపర్‌గా నటించావ్.. మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.. స్వర్గంలో ఉన్న జయలలిత కచ్చితంగా థ్రిల్ అయి ఉంటుంది' అని ఆర్జీవీ తన స్టైల్లో ట్వీట్ వేశాడు.

    మీది మీరే పట్టించుకోరు..

    మీది మీరే పట్టించుకోరు..

    ఇక దీనిపై కంగనా కూడా తన స్టైల్లో కౌంటర్ వేసింది. 'హేయ్ సర్.. కానీ నేను మీతో ఏ విషయంలోనూ ఏకిభవించకుండా లేను.. మీరంటే నాకు ఇష్టం.. మీమ్మల్ని ఎంతో ప్రశంసిస్తుంటాను. ఇలాంటి ఓ దరిద్రమైన ప్రపంచంలో మనిషికి ఉండే ఇగోలు, గర్వాలు ఊరికే హర్ట్ అవుతుంటాయి. కానీ అలాంటి వాటిని మీరు అసలు పట్టించుకోరు.. పైగా మీది మీరే పట్టించుకోరు.. తలైవిపై ప్రశంసలు కురిపించినందుకు థ్యాంక్స్' అని ట్వీట్ వేసింది.

    ఈ ప్రపంచంలోనే లేదు..

    ఈ ప్రపంచంలోనే లేదు..

    కంగనా ట్వీట్‌కు ఆర్జీవీ మరో ట్వీట్ వేశాడు. 'అవును నిజమే కంగనా.. ఎవరైన తమ నిర్ణయాన్ని ధృడంగా చెబితే.. ఎదుటి వాళ్లను రెచ్చగొట్టినట్టు అవుతుంది. హాలీవుడ్ నటుల కంటే నువ్ ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నావ్.. ఇది నేను ఒప్పుకోవాల్సిందే. నీలాంటి ఓ గొప్ప నటి ఈ ప్రపంచంలోనే లేదు.. ఇది నేను కచ్చితంగా అంగీకరిస్తాను.. నీకు క్షమాపణలు కూడా చెబుతున్నాను' అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.

    English summary
    RGV And Kangana Ranaut Tweets About Thalaivi Trailer,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X