Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వర్మ తో మంచు మనోజ్ “ఎటాక్” (ఫొటోలు)
హైదరాబాద్ : మంచు మోహన్ బాబు, విష్ణులతో పని చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం మంచు మనోజ్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి "ఎటాక్" అనే టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రం ఫొటోలను విడుదల చేసారు. ప్రతి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసే వర్మ, మనోజ్ సినిమాను ఒక నెల రోజుల్లో ఫినిష్ చేయాలని భావిస్తున్నారు. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, వడ్డే నవీన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సురభిని ఎంచుకొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. జగపతిబాబు తదితరులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఉషాకిరణ్ ఫిలిమ్స్ చిత్రం 'బీరువా'తో తెలుగునాట అడుగుపెట్టింది సురభి. తొలి చిత్రంతోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకొంది. ఇప్పుడామెకు అవకాశాలు వరుస కడుతున్నాయి. తాజాగా రామ్‌గోపాల్ వర్మ చిత్రంలో నటించే అవకాశం అందుకొంది.
ఆ ఫొటోలు మీ కోసం...

యాక్షన్ తో...
ఈ చిత్రం పూర్తి యాక్షన్ తో రూపొందనుందని సమాచారం. మంచు మనోజ్ లోని యాక్షన్ కోణాన్ని పూర్తిగ వాడుతున్నట్లు తెలుస్తోంది.

రానా వెళ్లిపోయాక
మొదట ఈ చిత్రాన్ని దగ్గుపాటి రానా తో అనుకున్నారు...కానీ చివరి నిముషంలో సీన్ లోకి మంచు మనోజ్ వచ్చారు.

రిలీజ్
ఈ చిత్రం ఎప్పుడు మొదలెట్టారో కానీ రిలీజ్ మాత్రం జూన్ లో అని తేల్చి చెప్పేసారు

ఓల్డ్ సిటీలో
ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఓల్డ్ సిటీలో జరుగుతోంది.

అవి వర్కవుట్ కాలేదు అయినా
ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ...మోహన్ బాబుతో, మంచు విష్ణుతో రెండు చిత్రాలు తీసారు.అవేమీ వర్కవుట్ కాలేదు

మనోజ్ క్రేజ్
మనోజ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

వడ్డే నవీన్ తో..
చాలా కాలం క్రితం హీరో గా రిటైరయ్యి తప్పుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు ఈ చిత్రంతో సీన్ లోకి వచ్చారు.

ప్రకాష్ రాజ్
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు.

జగపతి బాబు
మంచు మనోజ్, జగపతిబాబు కాంబినేషన్ లో కరెంట్ తీగ చిత్రం వచ్చింది. ఇప్పుడీ చిత్రం తెరకెక్కుతోంది

హీరోయిన్ ...
సందీప్ కిషన్.. 'బీరువా'తో తెలుగునాట అడుగుపెట్టింది సురభి. తొలి చిత్రంతోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకొంది. ఇప్పుడామె ఈ చిత్రంలో చేస్తోంది.