మియా మాల్కోవాలోని మరో కోణం.. ఫ్రీక్ అవుట్ అంటోన్న ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ రూటే వేరు. ఈ విషయం ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా నిరూపించుకున్నాడు. అందరూ ఓ దారిలో వెళ్తుంటే.. వర్మ మాత్రం మరో దారిలో వెళ్తాడు. అది కరోనా లాంటి కష్ట కాలమైన సరే. ఆర్జీవీ తనకు తోచింది మాత్రమే చేస్తాడు. దటీజ్ ఆర్జీవీ. పోర్న్ స్టార్‌తో ఓ కళా ఖండాన్నిరూపొందించిన వర్మ.. అప్పట్లో ఓ సెన్సేషనే క్రియేట్ చేశాడు. శృంగార తార మియా మాల్కోవాతో జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్) అంటూ ఓ లఘు చిత్రాన్ని నిర్మించాడు. ఇది అప్పట్లో తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకుంది.
తాజాగా మరో కళాఖండాన్ని (క్లైమాక్స్) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే ఇందులో మియా మాల్కోవా ఒంటి మీద బట్టలు ఉండటం కొసమెరుపు. అయినా సరే మియా మాల్కోవా రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తోంది. ఇందులోనూ హీటెక్కించే సీన్స్ ఎన్నో ఉన్నాయని టీజర్‌ను బట్టే తెలుస్తోంది. తాజాగా ఈ టీజర్ వైరల్ కావడంపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.

క్లైమాక్స్ మూవీ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ములేపింది. దెబ్బకు వన్ మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఇదే విషయాన్ని వర్మ తెలుపుతూ.. ఓ పోస్ట్ చేశాడు. 'క్లైమాక్స్ టీజర్ వన్ మిలియన్ వ్యూస్‌ను సాధించిన సందర్భంగా.. మియా మాల్కోవాతో నేను షూట్ చేసిన మ్యూజిక్ వీడియోను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నా.. పాట పేరు జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాటలో మియా మాల్కోవాను ఇంకెన్ని కోణాల్లో చూపెట్టాడో.


Click it and Unblock the Notifications











