సీఎం డైలాగ్ పాతది, వీళ్లు వెధవలా?...పేలుళ్లపై వర్మ సెటైర్లు
రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ కామెంట్స్
-బాంబు పేలుడు ఖండిస్తున్నాము అన్న సీఎం గారి డైలాగ్ 1965 బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి వింటున్నాను. అరగదీసిన పరాకాష్ట డైలాగు ఇది.
-తక్షణమే పట్టుకుంటామని అంటున్నారు. అలా చెయ్యగలిగే కెపాసిటీ ఉంటే ముందే ఎందుకు పట్టుకోలేదని నేనడుగుతున్నాను.
-ఢిల్లీ నుంచి స్పెషల్ టీం రప్పిస్తున్నామనేదానికి అర్థం లోకల్ టీం వెదవలనా?
-పొలిటీషియన్లు బాంబ్ బ్లాస్ట్ బాధితులకు ప్రగాఢ సానుభూతిని బర్త్ డే గిఫ్ట ఇచ్చినట్లు ఇస్తున్నారు.
-పీఎంగాను దిగ్బ్రాంతి వ్యక్తం చేయకుండా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అనుకున్నామా మనం? పొలిటీషియన్స్‌కు కోన వెంకట్ లాంటి మంచి రచయితలు కావాలి.
- పేలుళ్లపై విచారణ జరిపిస్తామన్న షిండేగారి డైలాగ్ ఈ దశాబ్దానికే మోస్ట్ ఒరిజినల్ హైలెట్ డైలాగ్ వాహ్.
-కఠిన చర్యలు తీసుకుంటామనే డైలాగ్ చిన్నప్పటి నుంచి వింటున్నాను. కానీ ఆ మాటలను మనలాంటి వెదవ ప్రజలు తప్ప వినాల్సిన వాళ్లు వినరు. ఎందుకంటే ఆ వినాల్సిన వారు బాంబులు పేల్చే ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు.


Click it and Unblock the Notifications












