twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం డైలాగ్ పాతది, వీళ్లు వెధవలా?...పేలుళ్లపై వర్మ సెటైర్లు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : రాజధాని దిల్ సుఖ్ నగర్లో వరుస పేలుళ్ల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయ నాయకులపై తన దైన రీతిలో సెటైర్లు వదిలారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో పదుదైన పదాలతో కామెంట్స్ చేసారు. సాధారణంగా రామ్ గోపాల్ వర్మకు తిక్క తిక్క కామెంట్లు చేయడం అలవాటు. ఈ సారి ఆయన కామెంట్లు కొన్ని బాగానే ఉన్నా, కొన్ని మాత్రం కాస్త తిక్కగానే ఉన్నాయి. అవేమిటో చూడండి మరి..

    రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ కామెంట్స్

    -బాంబు పేలుడు ఖండిస్తున్నాము అన్న సీఎం గారి డైలాగ్ 1965 బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి వింటున్నాను. అరగదీసిన పరాకాష్ట డైలాగు ఇది.

    -తక్షణమే పట్టుకుంటామని అంటున్నారు. అలా చెయ్యగలిగే కెపాసిటీ ఉంటే ముందే ఎందుకు పట్టుకోలేదని నేనడుగుతున్నాను.

    -ఢిల్లీ నుంచి స్పెషల్ టీం రప్పిస్తున్నామనేదానికి అర్థం లోకల్ టీం వెదవలనా?

    -పొలిటీషియన్లు బాంబ్ బ్లాస్ట్ బాధితులకు ప్రగాఢ సానుభూతిని బర్త్ డే గిఫ్ట ఇచ్చినట్లు ఇస్తున్నారు.

    -పీఎంగాను దిగ్బ్రాంతి వ్యక్తం చేయకుండా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అనుకున్నామా మనం? పొలిటీషియన్స్‌కు కోన వెంకట్ లాంటి మంచి రచయితలు కావాలి.

    - పేలుళ్లపై విచారణ జరిపిస్తామన్న షిండేగారి డైలాగ్ ఈ దశాబ్దానికే మోస్ట్ ఒరిజినల్ హైలెట్ డైలాగ్ వాహ్.

    -కఠిన చర్యలు తీసుకుంటామనే డైలాగ్ చిన్నప్పటి నుంచి వింటున్నాను. కానీ ఆ మాటలను మనలాంటి వెదవ ప్రజలు తప్ప వినాల్సిన వాళ్లు వినరు. ఎందుకంటే ఆ వినాల్సిన వారు బాంబులు పేల్చే ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు.

    English summary
    Ram Gopal Varma angry comments on Politicians Over Bomb Blasts. Just when his forthcoming film 'The attacks of 26/11' is about to be released in a week, serial blasts took place at Dilsukhnagar in Hyderabad on Thursday. Ram Gopal Varma tweeted, " Bomb peludu khandisthunnamu anna cm gaari dilagu 1965 black nd white cinemala nunchi vintunnanu ...aragadeesina paraakashta dilagu idhi".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X