అమ్మాయిలను వాడుకున్నారా?.. యాంకర్ ప్రశ్నకు చిర్రెత్తిపోయిన వర్మ.. మైక్ పడేసి జంప్!
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో ఎవరు లేనంత బిజీగా ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు సినిమాలు మరోవైపు వివధాలు, కాంట్రవర్సీలు, ప్రమోషన్స్ అంటూ మునుపెన్నడు లేనంత బిజీగా మారిపోయారు. ఇక పవర్ స్టార్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆర్జీవి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు చిర్రెత్తిపోయాడు. అమ్మాయిలను వాడుకుంటారా అనే ప్రశ్నకు కోపంతో ఊగిపోయారు.
Recommended Video

ఆర్జీవిలో పెరిగిన అసహనం
సాధారణంగా ఆర్జీవి గతంలో ఇంటర్వ్యూలు ఇస్తే చాలా కూల్ గానే ఉండేవారు. కానీ ఈ మధ్య ఆయనలో కూడా కొన్ని ప్రశ్నలకు అసహనం పెరుగుతోంది. పవర్ స్టార్ సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసిన వర్మ బజ్ అయితే బాగానే అందుకున్నాడు గాని కలెక్షన్స్ మాత్రం అనుకున్నంతగా రాలేవని టాక్ వస్తోంది. ఆ సినిమాపై పైరసీ ఎఫెక్ట్ గట్టిగానే పడినట్లు తెలుస్తోంది.

పరాన్నజీవి కౌంటర్
ఇక పరాన్నజీవి సినిమాతో ఆ చిత్ర యూనిట్ వర్మకు గట్టి కౌంటర్ ఇచ్చింది. పవర్ స్టార్ సినిమా ఫిక్ఛనల్ స్టోరీ అంటూ ఇన్ డైరెక్ట్ గా వచ్చిన వర్మకు పరాన్నజీవి మాత్రం డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది. ఆర్జీవి వాల్యూ తగ్గేలా సినిమాలో చూపించారు. అవకాశాల ఇప్పిస్తాను అని అమ్మాయిలను వాడుకుంటారనే విదంగా చిత్రీకరించారు.

అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశారా
ఇక ఇటీవల ఒక యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే తరహాలో యాంకర్ ప్రశ్న అడిగాడు. అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశారని, వాడుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు నిజం అంటారు అని వర్మను అడుగగా అందుకు ఆయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ నా పర్సనల్ విషయాలు అంటూ యాంకర్ పై మండి పడ్డారు.

అలా అడగడానికి నువ్వు ఎవరు?
అసలు ఆ విషయం ఎవరు చెప్పారు మీకు. ఎవడో ఎదో చెబితే నమ్మేస్తారా?. నా పర్సనల్ లైఫ్ నా సెక్స్ లైఫ్ గురించి ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. నా పర్సనల్ లైఫ్ గురించి అడగడానికి నువ్వు ఎవరు. నేను నాశనం చేశాను అంటే ఆ అమ్మాయి చెప్పాలి. లేదా నేను చెప్పాలి. అంతే గాని కావాలని ఇలాంటి ప్రశ్నలు అడిగి నా సమయం వృధా చేయకండి. నాకు చాలా పనులు ఉన్నాయి.

మైక్ తీసి పడేసిన వర్మ
నేను పవర్ స్టార్ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆ విషయం వదిలేసి వేరే విషయాలు మాట్లాడడం వేస్ట్. స్మార్ట్ గా యాక్ట్ చేయకండి అంటూ యాంకర్ కి కౌంటర్ ఇచ్చిన వర్మ మైక్ తీసి పడేసి ఇంటర్వ్యూ ముగించకుండానే వెళ్లిపోయారు. వర్మ ఆ ఇంటర్వ్యూలో దాదాపు చెప్పిన ప్రశ్నలకే సమాధానం చెప్పి చాలా ఆగ్రహానికి లోనయ్యారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











