twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి తమ్ముడి స్థానంలో నేనుంటే కొట్టేవాడిని: రామ్ గోపాల్ వర్మ

    వరుణ్ తేజ్ .. మీ నాన్న గురించి, నా గురించి నువ్వ చేసిన కామెంట్లు చదివాను. నువ్వు చెప్పింది కరెక్ట్. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాను' అని వర్మ ట్వీట్ చేసారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వోడ్కా మానేస్తుట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకాలం వోడ్కా మాత్తులోనే తాను ట్విట్టర్లో ట్వీట్లు చేసాను, ఆ ట్వీట్స్ వల్ల చాలా మంది బాధ పడ్డారు.... ఇకపై వోడ్కా తాగను, ఎవరినీ బాధించను అంటూ వర్మ ప్రకటించారు.

    అయితే వర్మ చేసిన ప్రకటనను చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ వర్మ తాజా ట్వీట్స్ చూస్తుంటే వర్మ నిజంగానే వోడ్కా మానేసారని స్పష్టం అవుతోంది. ఆయన ట్వీట్స్ లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. తాజాగా నాగబాబును, వరుణ్ తేజ్ ఉద్దేశించి వర్మ చేసిన ట్వీటే అందుకు కారణం.

    క్షమాపణ చెప్పిన వర్మ

    వరుణ్ తేజ్ .. మీ నాన్న గురించి, నా గురించి నువ్వ చేసిన కామెంట్లు చదివాను. నువ్వు చెప్పింది కరెక్ట్. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాను' అని వర్మ ట్వీట్ చేసారు.

    ఖైదీ వేడుకలో

    ఖైదీ వేడుకలో

    రామ్ చరణ్ గురించి, చిరంజీవి గరించి మెగా ఫ్యామిలీ గురించి వర్మ వివాదాస్పద కామెంట్స్, వారిని తక్కువ చేసి కామెంట్స్ చేయడంపై... నాగబాబు ‘ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. వర్మను అక్కు పక్కి అంటూ ఘాటుగా స్పందించారు.

    నాగబాబు కామెంట్లలో తప్పులేదు

    నాగబాబు కామెంట్లలో తప్పులేదు

    నేను తప్పుగా మాట్లాడాను కాబట్టే... నాగబాబు నాపై ఆ రోజు ఫైర్ అయ్యారు. ఆయన అలా ఫైర్ అవ్వడానికి నా వ్యవహార శైలే కారణం........ అని వర్మ తెలిపారు.

    చిరు తమ్ముడి స్థానంలో ఉంటే కొట్టేవాడిని

    నా లాంటి వాడు ఎవరైనా కామెంట్స్ చేస్తే నాగబాబు కేవలం మాటలతో వదిలేసాడు....అదే చిరంజీవి నా అన్నయ్య అయితే, నా లాంటి వాడు ఎవరైనా కామెంట్స్ చేస్తే నాగబాబు లా మాటలతో వదిలేసే వాడినికాదు..... ఆ స్థానంలో నేను ఉంటే కొట్టే వాడిని అని వర్మ పేర్కొన్నారు.

    English summary
    "IAmVarunTej i read ur comments on me about ur dad nd u ar right..it was wrong on my part to say hurtful things nd I apologise to u both" RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X