twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ 'అప్పల్రాజు' వాయిదా పడ్డ రిలీజ్ డేట్

    By Srikanya
    |

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' జనవరి 19న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతి రోజు అంటే జనవరి 12న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఓ కీలక సన్నివేశ చిత్రీకరణ లేటవటంతో ఈ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ సీన్ లో 23మంది ఇండస్ట్రీ టాప్ ఆర్టిస్టులు ఒకేసారి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ డేట్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమ స్ట్రైక్ లేకుండా ఉన్నట్లు అయితే ముందుగా అనుకున్నట్లు షూటింగ్ పూర్తయ్యేదని చెప్తున్నారు.

    కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: అప్పలరాజు అని వేయించుకోవటానికి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో వాలిన అప్పలరాజు కథే ఇది. కథ ప్రకారం ...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్ ‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే.

    అప్పల్రాజు పాత్రలో సునీల్‌ చేస్తున్నారు. స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X