కుమార్తె నిశ్చితార్ద వేడుకలో రామ్ గోపాల్ వర్మ

By Srikanya

Ram Gopal Varma-Revathy Varma
హైదరాబాద్: బంధాలు, బంధుత్వాలకు దూరంగా ఉంటానంటూ చెప్తూ, అలా బిహేవ్ చేసే రామ్ గోపాల్ వర్మ నిజ జీవితంలో తన కూతురు ఎంగేజ్ మెంట్ పంక్షన్ ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసారు. వర్మ మామగారు కాబోతున్నారు. వర్మ కుమార్తె రేవతివర్మ నిశ్చితార్థం బుధవారం (జనవరి 2, 2013) ప్రణవ్‌తో జరిగింది. హైదరాబాద్‌లోని రాడిస్సన్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో వర్మ పాల్గొన్నారు. కాబోయే దంపతుల్ని ఆశీర్వదించారు.

వర్మ కుమార్తె రేవతి వైద్య విద్యను అభ్యసించారు. ప్రణవ్‌ కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. వాళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఆగస్టులో వివాహానికి ముహూర్తం నిశ్చయించినట్లు తెలిసింది. నిశ్చితార్థ కార్యక్రమంలో వర్మ కుటుంబ సభ్యులు, బంధువులు, కొద్దిమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు రాజమౌళి ఆ వేడుకలో పాలుపంచుకున్నారు.

రాజమౌళి ఈ విషయమై ట్వీట్ చేస్తూ... "వర్మ తన కుమార్తె రిసెప్షన్ లో ఓ భాద్యత గల తండ్రిగా ఉండటం చాలా ఆనందం కలిగించింది... వాటే సైట్....హ..హ..హ" అన్నారు. ఇక ఈ పంక్షన్ కి హాజరైన వారు రాము చాలా ఆనందంగా ఈ పంక్షన్ లో పాల్గొన్నాడని, చాలా ఉత్సాహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ పంక్షన్ కి చాలా తక్కువ మంది పరిశ్రమలో వారిని ఇన్వైట్ చేసారు.

నా జీవితం, నా ఇష్టం అనుకొనే తత్వం రామ్‌గోపాల్‌ వర్మది. అనుబంధాలకు ఆయన పెద్ద విలువ ఇవ్వరని చిత్రసీమలో చెబుతారు. కుటుంబం గురించీ, కుమార్తె గురించీ ప్రశ్నలు వేసినా ఆయన సూటిగా సమాధానమివ్వరు. అలాంటి వర్మకి త్వరలో మామగారుగా ఈ కొత్త హోదా రాబోవటం చిత్రం అనిపించినా విచిత్రం మాత్రం కాదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X