twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీఎస్టీ ఎఫెక్ట్: పోలీస్ స్టేషన్లో వర్మ, మొబైల్, ల్యాప్ టాప్ సీజ్...ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి!

    By Bojja Kumar
    |

    Recommended Video

    జీఎస్టీ ఎఫెక్ట్: స్టేషన్లో వర్మ..... ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి

    సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' షార్ట్ ఫిల్మ్ వివాదం చిలికి చిలికి చివరకు రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్‌ గడప తొక్కేలా చేసింది. 'జీఎస్టీ' వివాదంలో ఆయనపై మహిళా సంఘాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నోటీసులు పంపారు. రెండు సార్లు ఆయన నోటీసులు అందగా షూటింగ్ బిజీ వల్ల డుమ్మా కొట్టారు. అయితే మూడో నోటీసుకు వర్మ దిగిరాక తప్పలేదు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో వర్మ విచారణకు హాజరయ్యారు.

    ప్రశ్నలతో వర్మ ఉక్కిరి బిక్కిరి

    ప్రశ్నలతో వర్మ ఉక్కిరి బిక్కిరి

    విచారణకు హాజరైన వర్మను పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. వర్మ రావడానికి ముందే పోలీసులు ఒక ప్రణాళిక బద్దంగా ప్రశ్నావళిని సిద్ధం చేసి పెట్టారు.

    మియా మాల్కోవా

    మియా మాల్కోవా

    అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది అని పోలీసులు వర్మను ప్రశ్నించినట్లు సమాచారం.

    ఈ సినిమాకు పెట్టుబడి ఎవరు పెట్టారు?

    ఈ సినిమాకు పెట్టుబడి ఎవరు పెట్టారు?

    విదేశాల నుండి సినిమా తీశామని చెబుతున్నారు, ఈ సినిమాకు పెట్టుబడి పెట్టినవారు ఎవరు? దానికి ఇండియా నుండి చెల్లింపులు చేశారా? అక్కడి టెక్నీషియన్లకు, యాక్టర్లకు ఏ విధంగా చెల్లింపులు చేశారు అని పోలీసులు వర్మను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

    ఎవరి ద్వారా ఈ వీడియో అప్‌లోడ్ చేశారు

    ఎవరి ద్వారా ఈ వీడియో అప్‌లోడ్ చేశారు

    ఈ వీడియోను విదేశాల నుండి అప్ లోడ్ చేశామని మీరు చెబుతున్నారు. అక్కడ ఎవరి ద్వారా అప్ లోడ్ చేయడం జరిగింది. విమియోతో ఎలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మీకు విమియో వెబ్ సైటుకు లింకు ఏమిటి? ఆ సంస్థ మీకేమైనా డబ్బులు చెల్లించిందా? లేక మీరు ఆ వెబ్ సైట్ కోసం డబ్బులు చెల్లించారా?... అంటూ వర్మను పోలీసులు ప్రశ్నించారు.

    పదే పదే వర్మ అదే సమాధానం

    పదే పదే వర్మ అదే సమాధానం

    పోలీసులు అడిగిన ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ సమాధానం ఒక్కటే చెబుతున్నారు. తాను సినిమాను విదేశాల్లో నిర్మించాను, భారతీయ చట్టాలు నాకు వర్తించబోవు అని ఆయన వాదిస్తున్నట్లు, పదే పదే అదే చెబుతున్నట్లు తెలుస్తోంది.

    ఆధారాలు ఉన్నాయా?

    ఆధారాలు ఉన్నాయా?

    విదేశాల్లో సినిమా నిర్మించినపుడు దానికి సంబంధించిన ఆధారాలు తమకు ప్రొడ్యూస్ చేయాలని అధికారులు వర్మను అడిగినట్లు సమాచారం.

    మహిళా సంఘాలపై అభ్యంతరకరంగా

    మహిళా సంఘాలపై అభ్యంతరకరంగా

    మరో వైపు జీఎస్టీ సినిమాను పూర్తిగా నిలిపి వేయాలని మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్న తరుణంలో ఈ విషయమై వర్మ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద కూడా అధికారులు వర్మను ప్రశ్నించారు.

    మీతో జీఎస్టీ తీస్తానంటూ...

    మీతో జీఎస్టీ తీస్తానంటూ...

    కొందు మహిళా సంఘాల నేతలపై కూడా వర్మ అభ్యంతరకర కామెంట్స్ చేశారు. మీరు ఒప్పుకుంటే మీతో కూడా జీఎస్టీ మూవీ సినిమా తీస్తానని ఆయన వ్యాఖ్యానించడం ఈ వివాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది.

    మొబైల్, ల్యాప్ టాప్ సీజ్ చేసిన పోలీసులు.

    మొబైల్, ల్యాప్ టాప్ సీజ్ చేసిన పోలీసులు.

    దాదాపు మూడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా ఆయన్ను పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. 24 ప్రశ్నలకు పోలీసులు వివరణ కోరినట్టు సమాచారం. ఈ రోజు విచారణ ముగిసిన వెంటనే మరో నోటీసును వర్మకు అందజేశారు. సోమవారం మళ్లీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఆయన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ పోలీసులు సీజ్ చేశారు.

    English summary
    Ram Gopal Verma, the controversial director of Telugu Cinema, decided to appear in front of Cyber Crime branch, today, that is, Saturday. He was given notices to help in the investigation of his comments against women while promoting God, Sex and Truth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X