twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హజారేను టార్గెఃట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

    By Bojja Kumar
    |

    వివాదాస్సద వ్యాఖ్యలు, వివాదాస్పద సినిమాలతో ఎప్పుడు వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పారు. అన్నా హజారేకు దేశ వ్యాప్తంగా ఊహించని విధంగా మద్దతు రావడంతో వర్మకు కన్నుకుట్టిందో? ఏమోగానీ హాజారేపై విమర్శల వర్షం కురిపించాడు.

    అధికారంలో ఉన్న వారు అవినీతికి పాల్పడటం, అధికారంలో లేని వారు వారిని చూసి అసూయ పడుతూ పోరాటాలు చేయడం గత కొంత కాలంగా జరుగుతున్న విషయమే అని వర్మ వ్యాఖ్యానించాడు. అవినీతి అదీ ఇదీ అంటూ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. నేను మాత్రం అలా మాట్లాడ దలచుకోలేదు. ఎందుకంటే నేను కూడా అవినీతికి పాల్పడే ఈ స్థాయికి వచ్చాను అంటూ నిస్సిగ్గుగా తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

    హజారే చేస్తున్న ఉద్యమాన్ని అతని సొంత ఉద్యమంగా చెప్పిన వర్మ....హాజారే వ్యక్తిగతంగా సెల్ఫిష్, అసూయపరుడు అనే విధంగా ట్విట్టర్ లో వివాదాస్పద కాంమెంట్లు చే శాడు. అవినీతిపై పోరాటం విషయంలో హజారే ఒంటెద్దు పోకడలు పోతున్నాడు, హాజరే ప్రవర్తిస్తున్న తీరు సరైంది కాదు అనే విధంగా వర్మ కామెంట్లు చేశాడు.

    తాను ఏం చేసినా ప్రచారం కోసం చేస్తా అని వర్మ గతంలో ఎన్నోసార్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా తన ప్రచారం కోసమే హజారేపై ఇలా విమర్శలకు దిగాడు కావచ్చు. మరి వర్మ వ్యాఖ్యలపై, అతని అత్యుత్సాహంపై హజారే మద్దతు దారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

    English summary
    It gives a clear indication that RGV is looking at Anna Hazare as a selfish and jealous individual. He camouflaged that giving his own opinions on corruption.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X