కొత్త తరహా భయం (వర్మ 'బూచి' ప్రివ్యూ)
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'భూత్ రిటర్న్స్' పేరుతో ఇటీవల ఓ చిత్రం తీశారు. అది 'బూచి' గా తెలుగులోకి అనువాదమై ఈ రోజు(శుక్రవారం) విడుదలవుతోంది. వర్మ హర్రర్ చిత్రాలు కొత్త కాకపోయినా ఈ సారి 3డిలో ఈ చిత్రం రానుండటంతో ఈ సినిమాపై ఓ వర్గంలో అంచనాలు పెరుగుతున్నాయి. 'బూచి' చిత్రం పిల్లలతో పెద్దవాళ్లను భయపెట్టించేందుకు తీశాను. అమాయకంగా కనిపించే చిన్న పిల్లల ద్వారా భయపెట్టిస్తే ఆ ప్రభావం పెద్దలపై తీవ్రంగా ఉంటుంది. ఆ ఆలోచన నుంచి పుట్టిన చిత్రమిది అని వర్మ అంటున్నారు.
జేడీ మాట్లాడుతూ - ''మామూలుగా ఇలాంటి చిత్రాల్లో శబ్దాలు మనల్ని భయపెడతాయి. కానీ ఈ చిత్రంలో రాము సెలైంట్ సీన్స్‌లో కూడా భయపెట్టారు. సినిమా చేస్తున్నప్పుడు మాకు భయంగా అనిపించలేదు కానీ చూస్తున్నప్పుడు మాత్రం భయం వేసింది'' అన్నారు.
రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ - '' చిన్న పిల్లలు అందంగా దేవతల్లా కనిపిస్తారు, అలాంటి వాళ్లను చూసి పెద్దవాళ్లు భయపడే సన్నివేశాలు ఎదురైతే ఎలా వుంటుందో మా 'బూచి' చిత్రంలో చూడవచ్చు. దయ్యాన్ని చూసే ధైర్యం ఎవరికీ ఉండదనీ, అయితే ఆ దయ్యం ఎలా ఉంటుంది? భయం ఎలా కలుగుతుంది? అన్న పాయింట్‌తో సినిమా అంతా డిఫరెంట్‌గా ఉంటుంది''వివరించారు.
బ్యానర్: ఆలుంబ్రా ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: మధుశాలిని, జె.డి.చక్రవర్తి, మనీషా కొయిరాలా, అలయనాశర్మ తదితరులు
కథ: రవి శంకర్,
సంగీతం: సలీం సులేమాన్,
కెమెరా: హర్షరాజ్ ష్రాఫ్, ఎం.రవిచంద్రన్ తావేర్,
ఎడిటింగ్: సునీల్ ఎం.వాథ్వానీ,
నిర్మాత: సునీల్‌జైన్,జితేంద్ర జైన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.


Click it and Unblock the Notifications











