twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త తరహా భయం (వర్మ 'బూచి' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'భూత్‌ రిటర్న్స్‌' పేరుతో ఇటీవల ఓ చిత్రం తీశారు. అది 'బూచి' గా తెలుగులోకి అనువాదమై ఈ రోజు(శుక్రవారం) విడుదలవుతోంది. వర్మ హర్రర్ చిత్రాలు కొత్త కాకపోయినా ఈ సారి 3డిలో ఈ చిత్రం రానుండటంతో ఈ సినిమాపై ఓ వర్గంలో అంచనాలు పెరుగుతున్నాయి. 'బూచి' చిత్రం పిల్లలతో పెద్దవాళ్లను భయపెట్టించేందుకు తీశాను. అమాయకంగా కనిపించే చిన్న పిల్లల ద్వారా భయపెట్టిస్తే ఆ ప్రభావం పెద్దలపై తీవ్రంగా ఉంటుంది. ఆ ఆలోచన నుంచి పుట్టిన చిత్రమిది అని వర్మ అంటున్నారు.

    జేడీ మాట్లాడుతూ - ''మామూలుగా ఇలాంటి చిత్రాల్లో శబ్దాలు మనల్ని భయపెడతాయి. కానీ ఈ చిత్రంలో రాము సెలైంట్ సీన్స్‌లో కూడా భయపెట్టారు. సినిమా చేస్తున్నప్పుడు మాకు భయంగా అనిపించలేదు కానీ చూస్తున్నప్పుడు మాత్రం భయం వేసింది'' అన్నారు.

    రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ - '' చిన్న పిల్లలు అందంగా దేవతల్లా కనిపిస్తారు, అలాంటి వాళ్లను చూసి పెద్దవాళ్లు భయపడే సన్నివేశాలు ఎదురైతే ఎలా వుంటుందో మా 'బూచి' చిత్రంలో చూడవచ్చు. దయ్యాన్ని చూసే ధైర్యం ఎవరికీ ఉండదనీ, అయితే ఆ దయ్యం ఎలా ఉంటుంది? భయం ఎలా కలుగుతుంది? అన్న పాయింట్‌తో సినిమా అంతా డిఫరెంట్‌గా ఉంటుంది''వివరించారు.

    బ్యానర్: ఆలుంబ్రా ఎంటర్‌టైన్‌మెంట్
    నటీనటులు: మధుశాలిని, జె.డి.చక్రవర్తి, మనీషా కొయిరాలా, అలయనాశర్మ తదితరులు
    కథ: రవి శంకర్,
    సంగీతం: సలీం సులేమాన్,
    కెమెరా: హర్షరాజ్ ష్రాఫ్, ఎం.రవిచంద్రన్ తావేర్,
    ఎడిటింగ్: సునీల్ ఎం.వాథ్వానీ,
    నిర్మాత: సునీల్‌జైన్,జితేంద్ర జైన్
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.

    English summary
    RGV's Boochi releasing this Friday. The major plus for Bhoochi is that it is based on ghosts and is coming in 3D format. It stars J.D. Chakravarthy, Manisha Koirala, Alayana and Madhu Shalini in key roles. Salim Suleiman has scored the music for this film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X