ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్‌లో అది పచ్చి అబద్దం.. అసలు నిజం ఇదే అంటున్న ఆర్జీవీ!
Recommended Video

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం విడుదలైంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ ని ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత చేపట్టిన ఎన్నికల ప్రచారం, ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన పరిణామాలని చూపించారు. ట్రైలర్ లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఉద్దేశించి ఓ సన్నివేశం ఉంది. ఆ సన్నివేశం గురించి రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శ్రీకృష్ణుడు అనుకుని
ట్రైలర్ లో చూపిన విధంగా.. ఇందిరా గాంధీ ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో కారులో వెళుతుండగా ఆమెకు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు వేషంలో ఉన్నా కటౌట్ కనిపిస్తున్నాయి. నిజంగానే శ్రీకృష్ణుడు అని భ్రమ పడిన ఇందిరా గండి ఆ కటౌట్ కు నమస్కరిస్తుంది. తన పక్కనే ఉన్నా వ్యక్తిద్వారా ఆయననే తమ ప్రత్యర్థి అని తెలుసుకున్న ఇందిరా గాంధీ ఆశ్చర్యంలో మునిగిపోతుంది. ఈ సంఘటన గురించి ప్రజల్లో కూడా కొంత ప్రచారం ఉన్నమాట వాస్తవమే.
అది పచ్చి అబద్దం
ఆ సన్నివేశాన్ని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తప్పుబట్టారు. ఇందిరాగాంధీ ఎన్టీఆర్ కటౌట్ కు నమస్కరించిన సంఘటన అవాస్తవం అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఎన్టీఆరే స్వయంగా ఇందిరాగాంధీని కలిసినప్పుడు ఆమెకు నమస్కరించారని ఓ ఫోటో ని పోస్ట్ చేశారు. ట్రైలర్ లో ఇందిరాగాంధీ నమస్కరిస్తున్న ఫొటో, ఎన్టీఆర్ ఇందిరకు నమస్కరిస్తున్న ఫొటోకు మూవీ వర్సస్ రియాలిటీ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దూసుకుపోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్
కొన్ని రోజుల క్రితమే వర్మ తాను తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య జరిగిన సంఘటనలు, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన కుటుంబంలో, పార్టీలో చోటు చేసుకున్న సంఘటనలని వర్మ అత్యంత వివాదాస్పదంగా చూపించబోతున్నారనే విషయం ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

అభిమానుల్లో ఉత్కంఠ
ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం నిరాశపరచడంతో ఎన్టీఆర్ మహానాయకుడు ఎలా ఉండబోతోందో అని అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయబోతుండడంతో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











