twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అర్జున్ రెడ్డి’ వివాదం: బస్తీమే సవాల్, దమ్ముంటే వాళ్లని ఆపండి.... ఆర్జీవి చాలెంజ్

    అర్జున్ రెడ్డి విషయంలో వర్మ, వీహెచ్ మధ్య వివాదం. ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.

    By Bojja Kumar
    |

    'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో.... ఆ సినిమాతో సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుండటం హాట్ టాపిక్ అయింది. ఇలా గొడవ పడుతున్న వారిలో ఒకరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అయితే, మరొకరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

    వీరి మధ్య చిన్నగా మొదలైన ఈ వివాదం మరింత ముదురుతోంది. 'అర్జున్ రెడ్డి' పోస్ట‌ర్ల‌ను కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి హ‌నుమంత‌రావు చించేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌పై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మండి పడ్డారు. ఆ సినిమా హీరో విజయ్ వెళ్లి విహెచ్ దుస్తులు చించేయాలంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

    హైదరాబాద్ లో ఎలా అడుగు పెట్టనివ్వను

    హైదరాబాద్ లో ఎలా అడుగు పెట్టనివ్వను

    వర్మ కామెంట్లపై వి. హనుమంతరావు స్పందిస్తూ.... ముంబై లో ఉండి ఏదిప‌డితే అది మాట్లాడ‌టం కాదు, ఈ సారి హైద‌రాబాద్ లో ఎలా అడుగు పెడ‌తావో చూస్తా అంటూ రామ్ గోపాల్ వర్మకు వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు.

    Recommended Video

    Pelli Choopulu Fame Vijay Devarakonda's Arjun Reddy Movie Trailer Out
    వర్మ కౌంటర్

    వర్మ కౌంటర్

    వీహెచ్ కామెంట్లపై వర్మ కౌంటర్ ఇస్తూ.... ‘సర్... మీరు నన్ను హైద‌రాబాద్ లో అడుగుపెట్ట‌నివ్వ‌రా? ప్ర‌స్తుతం నేను హైద‌రాబాద్‌లోనే ఉన్నా' అంటూ కౌంటర్ వేశారు.

    బస్తీమే సవాల్

    బస్తీమే సవాల్

    ‘వీహెచ్ సార్... నేను రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్ర‌సాద్ ఐమ్యాక్స్ లో అర్జున్ రెడ్డి మార్నింగ్ షో చూసేందుకు వ‌స్తున్నా... అక్క‌డ చూసుకుందాం.. బ‌స్తీ మే స‌వాల్' అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ ఛాలెంజ్ విసిరాడు.

    దమ్ముంటే వాళ్లని ఆపండి

    దమ్ముంటే వాళ్లని ఆపండి

    హనుమంతరావుగారు హైద‌రాబాద్‌లో నన్ను అడుగు పెట్టనీయడం కన్నా, మీకు దమ్ముంటే మీ మనవళ్ల వయసున్న అబ్బాయిల‌ను, అమ్మాయిల‌ను ‘అర్జున్ రెడ్డి' సినిమా థియేట‌ర్లలోకి అడుగు పెట్ట‌కుండా ఆపండి అంటూ సవాల్ చేశారు.

    English summary
    It is known that congress senior leader V Hanumantha Rao tore the Kissing poster of Arjun Reddy movie. Ever controversial RGV responded on the issue and posted comments in his own style.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X