twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సావిత్రి’ కాదు ‘శ్రీదేవి’

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు రోజుల క్రితమే తన కొత్త సినిమా ‘సావిత్రి' ని ప్రకిటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసాడు. ఈ సినిమా కాన్సెప్ట్ టీనేజ్ లోని తమకు ఎదురైన తొలి యవ్వన అనుభూతుల ఆధారంగా తెరకెక్కించనున్నామని చెప్పారు. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటినుంచీ వివాదాలు మొదలయ్యాయి.

    అంతేకాకుండా ఫస్ట్ లుక్ విడుదల చేసిన రెండవరోజే వర్మకి టైటిల్ సమస్య వచ్చి పడింది. దాంతో ఆయన ఈ టైటిల్ ని ‘శ్రీదేవి' గా మార్చాడు. పవన్ కళ్యాణ్ తో పంజా నిర్మించిన నిర్మాత అయిన నీలిమ తిరుమలశెట్టి ఇదే టైటిల్ ని తన సినిమాకి రిజిష్టర్ చేసానని తెలియచేయటంతో టైటిల్ ని మార్చారని తెలుస్తోంది. కూడా టైటిల్ మార్పుకు మరో కారణం.

    RGV changes Savithri to Sridevi

    ఈ శ్రీదేవి సినిమా కథా సహకారం కోసం వర్మ ప్రేక్షకులను తమ టీనేజ్ లో జరిగిన అనుభవాల గురించి వర్మ టీంకి పంపితే వాటిలో కొన్నిటిని సినిమాలో పెట్టుకుంటామని కూడా తెలియజేశాడు. సినిమా గురించి వర్మ చెబుతూ....నాకు సరస్వతి టీచర్ ఉన్నట్లే మీమీ జీవితాతల్లో..మీ టీచర్లో, మీ పక్కింటి లేదా ఎదురింటి ఆంటీలో, మీ అక్క ఫ్రెండ్సో, మీ ట్యూషన్ టీచర్లో...ఇలా రకరకాల ‘సావిత్రి'లు ఉండే ఉంటారు. అలాగే మీ అందరి జీవితాల్లో తారసపడిన ఆ సావిత్రులందరి ఇన్స్ పిరేషన్ తోనే ఈ ‘శ్రీదేవి' సినిమా స్టార్ట్ చేస్తున్నామని తెలిపారు.

    English summary
    Director Ram Gopal Varma has changed his film title Savithri to Sridevi!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X