twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘RGV అప్పుల ఊబిలో.. కోట్ల రూపాయలు ఎగ్గొట్టి చీటింగ్..’

    |

    ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ రూపొందించిన తాజా సినిమా తెలుగులో 'మా ఇష్టం' (డేంజరస్) , హిందీలో కత్రా' సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చింది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం విడుదల కావాల్సిన మా ఇష్టం చిత్రం వాయిదా పడింది. లోగడ వర్మ తీసిన కొన్ని చిత్రాలకు ఆయనతో కలసి నట్టి కుమార్ భాగస్వామ్యం వహించడంతో పాటు కొన్ని సినిమాలకు తన స్నేహితులతో కలసి తాను కొంత డబ్బును ఫైనాన్స్ చేశారు. అయితే ఎన్నోమార్లు తమకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి వర్మ దగ్గర ప్రస్తావించినా లాభం లేకపోయింది. దాంతో నిర్మాత నట్టి కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి వర్మ, నిర్మాత రామసత్యనారాయణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ..

    తప్పించుకు తిరుగుతున్న ఆర్జీవి

    తప్పించుకు తిరుగుతున్న ఆర్జీవి

    రాంగోపాల్ వర్మ ఎంతసేపు తప్పించుకుని తిరుగుతూ డబ్బులను ఎగగొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు అర్ధమైందని హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేస్తిన ప్రెస్ మీట్లో నట్టి కుమార్ వెల్లడించారు. తనకు, తన స్నేహితులందరికి కలిపి దాదాపు 5 కోట్ల 29 లక్షల రూపాయలు వర్మ బాకీ ఉన్నారు. తమకు రావల్సిన డబ్బుల కోసం ఎంతోకాలం ఎదురుచూశాం. వర్మతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రతీ సినిమాకు విడుదలకు ముందు 50 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు డాక్యుమెంట్ రాసి ఇచ్చారు. చివరకు ఇచ్చిన మాటపై నిలబడకుండా సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు అని నట్టి కుమార్ అన్నారు.

    ముంబై, గోవాలో ఆఫీస్ ఎత్తేసి..

    ముంబై, గోవాలో ఆఫీస్ ఎత్తేసి..


    ముంబైలో కంపెనీ పెట్టి భారీ ఆఫీస్ తెరిచారు. అక్కడ 12 కోట్లు అప్పుపడ్డాడు. అప్పు చెల్లించకుండా పారిపోయి వచ్చి నన్ను కలిశాడు. ఆ సమయంలో నేను అందరి వద్ద నుంచి డబ్బులు ఇప్పించాను. ఆ తర్వాత హైదరాబాద్ ఆఫీస్ ఎత్తేసే గోవాలో ఆఫీస్ పెట్టావు. అక్కడ కూడా అప్పులు చేసి.. కారు డ్రైవర్‌ కూడా డబ్బులు చెల్లించకుండా పారిపోయి హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు మరో వ్యక్తిని పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నాడు. ఏదైనా మాట్లాడితే.. ముంబైలోని మాఫియా, రాజకీయ నేతల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

    ఆర్జీవి నీకు దమ్ముందా?

    ఆర్జీవి నీకు దమ్ముందా?

    తమలాగే వర్మ బాధితులు ఎందరో ఉన్నారు. వైఫ్ ఆఫ్ వరప్రసాద్ నుంచి ఏ సినిమాకు కూడా లాభాలు రాలేవు. ప్రతీ సినిమాకు నిర్మాతను ముంచేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని నిరూపించే దమ్ముందా? నీకు దమ్ముంటే ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధం. వర్మ లాంటి వాడికి నిర్మాత రామసత్యనారాయణ తందాన అంటాడు. అనేక సినీ యూనియన్ల వారికి కూడా ఆయన బాకీ ఉన్నారని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో కలసి సినిమాలు, చేసి, వారిని ఆర్ధికంగా మోసగించడం వర్మ పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి ఇద్దరు దొంగలకు తగిన బుద్ది చెబుతాం అని నట్టి కుమార్ అన్నారు.

    సినిమా వాయిదాపై వర్మ అబద్దాలు

    సినిమా వాయిదాపై వర్మ అబద్దాలు

    హైదరాబాద్ వదిలి, ముంబై, ఆ తర్వాత ముంబై, వదిలి తిరిగి హైదరాబాద్, గోవా చేరుకుని ఇక్కడి వాళ్ళను మోసగిస్తున్నారని ఆయన చెప్పారు. వర్మ ఎక్కడ చర్చకు వస్తాను అన్నా తాను సిద్ధమని నట్టి కుమార్ సవాల్ విసిరారు. ఒక వైపు కోర్టు మా ఇష్టం సినిమా విడుదలపై స్టే విధిస్తే, తాము సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు వర్మ చెప్పుకోవడాన్ని బట్టి ఆయన ఎలాంటి వ్యక్తి అన్నది అందరికీ అర్థమవుతున్నది అని నట్టి కుమార్ ఈ సందర్భంగా అన్నారు.

    Recommended Video

    RGV's Maa Istam Movie Press Meet Held In Hyderabad | Filmibeat Telugu
    వర్మ బాగోతం బయటపెడుతా..

    వర్మ బాగోతం బయటపెడుతా..

    డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా ప్రెస్ మీట్ తర్వాత రాజకీయ నేతలు కూడా బయటకు వస్తారు. రెండు మూడు రోజుల్లో వర్మ బాగోతాన్ని బయటపెడుతాను. ఇప్పటికి నేను సహనం వహిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ముఖం చూసి వదిలేస్తున్నాను. దమ్ముంటే చర్చకు వచ్చి నా ఆరోపణలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఉంటున్న టీఆర్ఎస్ నేతల ఆఫీస్ ఎవరిది? లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో డబ్బుల వ్యవహారం అంతా బయటకు వస్తుంది అని నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    వర్మ స్పందన ఇలా..

    వర్మ స్పందన ఇలా..


    ఇదిలా ఉండగా, మా ఇష్టం సినిమా రిలీజ్ వాయిదాపై ట్విట్టర్‌లో రాంగోపాల్ వర్మ స్పందించారు. ఆర్జీవి ట్వీట్ చేస్తూ.. మా ఇష్టం DANGEROUS సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా theaters non cooperation దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Director RGV's rift with Natti Kumar goes viral in the media. Natti Kumar alleged that RGV has to pay 5 crores to him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X