రాణా దగ్గుబాటి వల్లే ఈ రూమర్స్ ..వర్మ
రాణా దగ్గుబాటిని అభిషేక్ బచ్చన్ స్థానంలో తీసుకోవడం వల్లే రకరకాల రూమర్స్ ప్రారంభమవుతున్నాయి.కాబట్టి వాటికి చెక్ చెప్పేందుకు ఈ నెలాఖరున 'డిపార్ట్‌మెంట్'ను మొదలుపెడతాం అంటున్నారు ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ.ఆయన్ని రీసెంట్ గా కలిసిన మీడియా.. 'భూత్' సీక్వెల్ సినిమాను ఆపేసి 'డిపార్ట్‌మెంట్'తీస్తున్నారని.. అమితాబ్ బచ్చన్‌తో తనకు విబేధాలు లేవని చెప్పేందుకే ఇలా చేస్తున్నారటగా అని అడిగితే ఇలా స్పందించారు.
అలాగే ..మీడియాలో నా మీద రకరకాల రూమర్స్ సృష్టిస్తున్నారు. మళ్లీ మీరే నా దగ్గరకు వచ్చి ఇలా జరిగిందట.. నిజమేనా? అని ప్రశ్నిస్తున్నారు. వాటికి నన్నెలా రియాక్టు అవమంటారు చెప్పండి?'' అని ప్రశ్నించారు రామ్‌గోపాల్ వర్మ. ఇక పై విషయమై క్లారిటీ ఇస్తూ..అసలు అమితాబ్ 'డిపార్ట్‌మెంట్' నుంచి బయటకు వెళితే కదా.. తిరిగి రావడానికి..ఆయనకు నాకు ఎలాంటి విభేదాలు లేవు. అమితాబ్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటి నటిస్తున్నారు. ఇంతకుమించి ఈ ప్రాజెక్టుపై ఇంకేమీ మాట్లాడనని అన్నారు.


Click it and Unblock the Notifications











