For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లరి నరేష్ చిత్రం రీమేక్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ

  By Srikanya
  |

  ముంబై : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ రీమేక్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. అయితే ఆయన దర్శకుడుగా కాదు ..కో ప్రొడ్యూస్ చేస్తూ హిందీలో పర్యవేక్షిస్తారు. ఆ చిత్రం మరేదో కాదు... అల్లరి నరేష్ కొత్త చిత్రం 'సుడిగాడు'. ఈ చిత్రం విడుదలై మంచి కలెక్షన్స్ సంపాదించి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. తెలుగు నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని హిందీ రైట్స్ తీసుకున్నారు. ఆయన రామ్ గోపాల్ వర్మతో కలిసి నిర్మిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ బ్రాండ్ ఇమేజ్ ఈ చిత్రం హిందీ మార్కెట్ కి ఉపయోగపడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  హిందీ వెర్షన్ కు గానూ రితీష్ దేశ్ ముఖ్ హీరోగా చేస్తున్నారు. ఆయన ఈ చిత్రం చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రితీష్ ..వర్మ దర్శకత్వంలో చిత్రాలు చేసి ఉన్నారు. దాంతో ఆయన వర్మ చెప్పగానే ఈ చిత్రం ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హిందీ వెర్షన్ కి సరిపడేలా స్క్రిప్టు వండుతున్నారు. పాత,కొత్త సూపర్ హిట్ హిందీ చిత్రాలను స్పూఫ్ చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు. తెలుగు,తమిళ మాదిరిగానే హిందీలోనూ ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అతి చిన్న బడ్జెట్ లో అతి పెద్ద విజయం ఈ చిత్రం ద్వారా సాధించవచ్చని సురేష్ బాబు నిర్ణయించుకునే ఈ రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే దర్సకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.

  గతంలో రామ్ గోపాల్ వర్మ సిని పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో సెటైర్ మూవీ గా కథ,స్క్రీన్ ప్లే,అప్పలరాజు చిత్రం రూపొందించారు. కానీ ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది. ఇక సుడిగాడు చిత్రం గురించి అల్లరి నరేష్ మాట్లాడుతూ..."ఈ సినిమా మీద అంచనాలైతే ఉన్నాయి కానీ ఈ స్థాయి కలెక్షన్లు వస్తాయని మాత్రం నేను ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ 'సుడిగాడు' పెద్ద హిట్టయింది. తొలివారంలో రూ. 8 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. సినిమాలోని వినోదం వల్లే ఆ స్థాయి హిట్టయ్యిందనేది నా అభిప్రాయం. పబ్లిసిటీకి, మౌత్ టాక్ విస్తరించడం కూడా దీనికి కారణం. ఒరిజినల్ 'తమిళ్ పడమ్' కంటే పెద్ద హిట్టయింది. ఆ సినిమా డైరెక్టర్ అముదన్‌కు అది తొలి చిత్రం.

  'సుడిగాడు' రిలీజయ్యాక ఆ సినిమా హిందీ, కన్నడ రీమేక్ హక్కులు అడుగుతున్నారని ఆయన చెప్పారు.మా సినిమాను చిన్న సినిమాల్లో 'గబ్బర్‌సింగ్', 'దూకుడు' అంటున్నారు'' అని ఆనందంగా చెప్పారు అల్లరి నరేష్. తమిళ చిత్రం 'తమిళ్ పడమ్' ఆధారంగా అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రూపొందించిన 'సుడిగాడు' సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఖర్చు పెట్టిన దానికి తగ్గట్లే బిజినెస్ జరగడం, కలెక్షన్లు రావడం, ఈ సినిమాని కొనుక్కున్న వాళ్లంతా సంతోషంగా ఉండటం చాలా హ్యాపీ. ఈ సినిమా కోసం భీమనేనిగారు చాలా కష్టపడ్డారు. స్పూఫింగ్ (పేరడీ) కోసం వంద సినిమాల్ని ఎంపిక చేసుకోవడం, వాటిలోంచి ఈ సినిమాకి పనికివచ్చే అంశాల్ని ఎంచుకోవడం సామాన్య విషయం కాదు అన్నారు.

  English summary
  Ram Gopal Varma recently watched Allari Naresh's Sudigadu. The latest is that Riteish has okayed to act in the Bollywood remake of this film, which itself was remake of a Tamil hit, Tamizh Paadham. Producer D Suresh Babu and Ram Gopal Varma are going to produce the film in Hindi. Suresh Babu bought the remake rights and he's co-producing it in Hindi with RGV.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X