ఎప్పుడూ ఏదో ఒక మాట విసురుతూ నిరంతరం వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ దృష్టి తాజాగా బిపాసా బసు బికినీ పై పడింది.ఆమె తన తాజా చిత్రం'ప్లేయర్స్'చిత్రం కోసం మరో మారు బికినీ వేసింది.ఆ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసారు.దాన్ని చూసిన వర్మ వెంటనే తన ట్విట్టర్ లో...ఇప్పుడే 'ప్లేయర్స్'ఫస్ట్ లుక్ చూసాను.బిపీసా బిలియన్ డాలర్ బిల్ లాగ ఉంది..హ..హ..హ..అంటూ ట్వీట్ చేసారు.దానికి ఆమె కూడా స్పందిస్తూ..ధాంక్యూ..ఎమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు.అబ్బాస్ మస్తాన్..తమ సినిమాలను సూపర్ స్టైల్స్ లో తయారు చేస్తారు అని ట్వీట్ చేసింది.ఇక బిపాసా బసు గతంలోనూ 'ధూమ్-2' చిత్రంలో బికినీ వేసి అదరకొట్టింది. ఈసారి 'ప్లేయర్స్' చిత్రం కోసం ఈత దుస్తులు ధరించి అందరిని షాక్ చేసింది. అబ్బాస్-మస్తాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2003లో వచ్చిన హాలీవుడ్ చిత్రం 'ది ఇటాలియన్ జాబ్'కి రీమేక్. అభిషేక్ బచ్చన్, బాబీడియోల్, సోనమ్ కపూర్, నీల్‌నితిన్ ముఖేశ్, ఓమీ వైద్య, సికందర్ ఖేర్ తదితరులు నటించారు. వచ్చే ఏడాది జనవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.