twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీను వైట్లపై రామ్ గోపాల్ వర్మ కామెంట్

    By Srikanya
    |

    శ్రీను వైట్ల తన తాజా చిత్రం దూకుడుతో హాట్ డైరక్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వర్మ తన ట్విట్టర్ లో...నేను జస్ట్ ఇప్పుడే బాగా క్రిందగా ఎగురుతున్న ఎరయ్ ప్లేన్ ని చూసాను..కానీ సడెన్ గా రియలైజ్ అయ్యాను..అది బాగా ఎగురుతోందని..అదే శ్రీను వైట్ల అని అన్నారు. ఇక శ్రీను వైట్ల దూకుడులో వర్మని ఓ చోట చూపెడతాడు. విలన్ సోనూ సూద్ తన తమ్ముడుని చంపిన వాడి ఫోటో అంటూ మహేష్ బాబు ఫోటో ఇచ్చి ఫాక్స్ చేయమంటే అది అందుకున్న ధర్మవరపు సుబ్రమణ్యం ..అది పంపకుండా రామ్ గోపాల్ వర్మ ఫోటో పంపుతారు. అది చూసిన లోకల్ విలన్స్ కోట శ్రీనివాసరావు, షాయిజి షిండే ఎవరీ ఫేస్ ఎక్కడో చూసినట్లు ఉందే అంటూ ఆలోచనలో పడతారు.అలా వర్మ ఫోటోను ఉపయోగించుకుని కామిడీ చేయటం వర్మకి నచ్చినట్లుంది. ఇక దూకుడు చిత్రం మొదటివారంలోనే ఈ సినిమాను సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి మంచి లాభాలు పొందాలన్న నిర్మాతలు వ్యూహం సక్సెస్ అయినట్లైంది.


    మరో ప్రక్క చెన్నైలో ఈ సినిమా 15 థియేటర్లలో రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ ఇచ్చింది.దీనికి తోడు దూకుడు ఇప్పుడు బెంగుళూరు నగరంలో సరికొత్త రికార్డుల మోతతో విజయవంతంగా నడుస్తోంది. ఈ సినిమా విదేశాల్లో 'దబాంగ్‌" రికార్డును అధిగమించింది. ఒక్క అమెరికాలోనే 2రోజుల్లో 15లక్షల డాలర్లను వసూలు చేసి రికార్డ్‌ సృష్టించింది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. తొలి మూడు రోజుల్లో రూ. 21.22 కోట్ల షేర్‌ని వసూలు చేసి 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుని సాధించింది . 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఆల్ టైమ్ రికార్డుల్ని సృష్టిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాతలు చెప్తున్నారు. అమెరికాలో మూడు రోజుల్లో 15 లక్షల డాలర్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. 1600పైగా థియేటర్లలో సినిమా రిలీజైంది.

    English summary
    RGV posted on his twitter account – “Just now I saw a very low flying airplane and then I suddenly realized that it’s a very high flying Srinu Vytla”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X