నాకు కుల పిచ్చి.. అయ్యా.. నీ కాళ్ల మీద పడిపోతా.. రాంగోపాల్ వర్మ

Recommended Video

Bhairava Geetha Pre Release Event : Ram Gopal Varma Speech | Filmibeat Telugu

భైరవగీతం మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో సందడి సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ వర్మ యాంకర్‌గా మారారు. వేదికపైన తనదైన స్టయిల్లో సెటైర్లు, కామెంట్లు చేస్తూ ఆకట్టుకొన్నాడు. భైరవగీత సినిమా దర్శకుడు సిద్ధార్థను అతిథులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి భైరవగీత హీరో హీరోయిన్లు ధనుంజయ, ఇరా మోర్, ఇతర నటీనటులు హాజరయ్యారు. ఈ వేడుకలో వర్మ చేసిన సందడి ఏమిటంటే..

నాకు కులం ఫీలింగ్

నాకు కులం ఫీలింగ్

యాంకర్‌గా మారిన వర్మ ఆ చిత్రంలోని పాటలను, వాటికి సంబంధించిన సందర్బాలను వెల్లడిస్తూ దర్శకులు, సినీ రచయితల చేత ఆవిష్కరించారు. ఓ పాటను రిలీజ్ చేయడానికి ముందు దర్శకుడు సుధీర్ వర్మను వేదిక వైపు పిలుస్తూ.. నాకు కుల పిచ్చి. అందుకే సుధీర్ వర్మను పిలుస్తున్నాను అని అన్నారు.

RX 100 కాదు.. RDX 100

RX 100 కాదు.. RDX 100

మరోపాటను RX 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతితో రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా RX 100 కాదు.. RDX 100 అంటూ అజయ్‌ని వేదికపైకి పిలిచారు. సినిమా రిలీజ్‌కు ముందే హిట్ అవుతుందని చెప్పాడు. అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకొన్నాను. ఒకవేళ హిట్ అయితే కాన్ఫిడెన్స్.. హిట్ కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందని అభిప్రాయపడ్డాను అని పేర్కొన్నారు.

వర్మ నాకు దేవుడి లాంటి వాడు

వర్మ నాకు దేవుడి లాంటి వాడు

ఇక నిర్మాత రామసత్యనారాయణతో మరో పాటను రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ.. కొద్ది సంవత్సరాలు వర్మ చాలా సినిమాలు తీశాడు. కానీ ఎక్కువ డబ్బులు వచ్చింది నేను నిర్మించిన సినిమానే. ఈ సినిమా తర్వాత మరో సినిమా తీసే అవకాశం ఇవ్వాలని కోరుకొంటున్నాను. వర్మ నాకు దేవుడు లాంటి వాడు అని అన్నారు.

నీ కాళ్ల మీద పడిపోతాను

నీ కాళ్ల మీద పడిపోతాను

భైరవగీత సినిమా బాగుంది. తప్పుకుండా విజయం సాధిస్తుంది. రూ. 10 కోట్లకుపైగా కలెక్షన్లను సాధిస్తుందని రామసత్యనారాయణ అనగానే వర్మ వెంటనే నీ కాళ్ల మీద పడిపోతాను అని అనడంతో వేదికపై నవ్వులు పూచాయి. ఇలా తన మార్కులో వర్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సందడిగా మార్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X