Don't Miss!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అటొచ్చి ఇటొచ్చి మహేష్ బాబుపై పడిన వర్మ.. సంచలన కామెంట్స్
Recommended Video
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయనేం మాట్లాడినా అదో ప్రభంజనం. మనసుకు ఏదనిపిస్తే అది ఏ మాత్రం అదాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేయడం ఆయన నైజం. ఇదే వర్మలోని బెస్ట్ క్వాలిటీ కూడా. కానీ వర్మ ముక్కుసూటి మాటలు కొన్ని సందర్భాల్లో కొందరిని తీవ్రంగా కలచివేస్తుంటాయి. అయినా అవేవీ వర్మ పట్టించుకోరు. ఈ పర్టిక్యులర్ విషయంలో నాకనిపించింది నేను చెప్పా. అంతేగానీ నా మాటే వేదం అని చెప్పట్లేదుగా! ఆ పర్టిక్యులర్ ఇష్యుపై మీకెలా అనిపిస్తే అలాగే నడుచుకోండి. అని నిర్మొహమాటంగా కొట్టిపారేయడం వర్మ లోని మరో కోణం. కాగా తాజాగా ఆయన మహేష్ బాబుపై చేసిన కొన్ని కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి. అవేంటో చూద్దామా..

మహర్షి మూవీ
వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో మహేష్ బాబు 25 వ సినిమాగా మహర్షి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్రంలో మహేష్ నటనతో పాటు, రైతు నేపథ్యంలో తెరకెక్కిన కొన్ని సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి. పలువురు పొలిటిషన్స్ సైతం ఈ సినిమాపై, ఇందులో చూపించిన సామాజిక అంశాలపై స్పందించారు.

వర్మ వంతుగా
మహర్షి పై పొలిటిషన్స్ స్పందన చూసిన రామ్ గోపాల్ వర్మ.. మహర్షి విషయంలో తన వాయిస్ ని కూడా వినిపించారు. 'మహర్షి' చిత్రంపై తనదైన శైలిలో కామెంట్స్ సూపర్ స్టార్ మహేష్ బాబును సున్నితంగా విమర్శించారు వర్మ. ఈ సినిమాపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి.

నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు
తనకు గ్రామాలన్నా, పంట పొలాల నేపథ్యంలో సినిమాలన్నా కూడా పెద్దగా ఇష్టం ఉండదని వర్మ పేర్కొన్నారు. అందుకే తాను రైతు నేపథ్యం, వ్యవసాయ నేపథ్యం ఉన్న కథలను ఎంపిక చేసుకోనని అన్నారు. ప్రజలకు కూడా అలాంటి నేపథ్యం ఉన్న సినిమాలంటే పెద్దగా పట్టింపు ఉండదు. ఎక్కువ శాతం ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలనే కావాలనుకుంటారు అని వర్మ ఆశ్చర్యపరిచే మాటలు మాట్లాడారు.

సినిమాలో సందేశం బాగుందని
ప్రస్తుతం మహర్షి సినిమా చూస్తున్న వారంతా మహేష్ బాబు పై అభిమానంతో వస్తున్నారు తప్ప సినిమాలో సందేశం బాగుందని ఎవ్వరూ రావడం లేదని వర్మ పేర్కొనడం గమనార్హం. ఒక వేళ మహర్షి చిత్రంలో మహేష్ బాబు లేకుంటే ఎంత మంది ఆ సినిమాను చూస్తారో చెప్పగలరా? అంటూ వర్మ వేసిన ప్రశ్న పెద్ద దుమారమే రేపుతోంది. మహర్షి చిత్రంలో సందేశం ఉన్నా కూడా ఎక్కువ శాతం మంది ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే ఈ సినిమాకు వెళ్తున్నారని తనదైన కామెంట్ చేశారు వర్మ.

200 కోట్ల దిశగా
మరోవైపు
ఇప్పటికే
3
వారాలు
పూర్తి
చేసుకున్న
మహర్షి
సినిమా
మంచి
వసూళ్లు
రాబడుతోంది.
ప్రపంచ
వ్యాప్తంగా
ఇప్పటికే
150
కోట్ల
మార్క్
దాటేసిన
మహర్షి
200
కోట్ల
దిశగా
పరుగులు
పెడుతోంది.
మహేష్
కెరీర్
లో
కొత్త
ఫీట్స్
సాధిస్తూ
ఓ
మైలురాయిగా
మిలుస్తోంది
మహర్షి
మూవీ.