twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్జీవికి కరోనా పాజిటివ్: లాయర్.. కోర్టుకు డుమ్మా కొట్టి అప్సరతో లైవ్‌లోకి వర్మ!

    |

    రామ్ గోపాల్ వర్మకు కరోనా?, గత కొన్ని రోజులుగా ఈ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలా వస్తోన్న వార్తలు రూమర్లని వర్మ ఖండించాడు. అది కూడా నోటితోనో మాటలతోనో కాదు చేతలతో. జిమ్‌లో తెగ కష్టపడుతూ పెంచిన కండలను చూపిస్తూ.. కరోనా గిరోనా లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ లోపే మరో కథనం బయటకు వచ్చింది. వర్మకు కరోనా సోకిందని అతని లాయరే కోర్టులో చెప్పాడట. అయితే ఈ వార్తలను సైతం వర్మ ఖండించాడు.

    వర్మకు కరోనా..

    వర్మకు కరోనా..

    అసలే హైద్రాబాద్‌లో కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్మ నిరవధికంగా షూటింగ్‌లంటూ బిజీగానే ఉంటున్నాడు. వరుస ప్రాజెక్ట్‌లతో వర్మ తెగ హల్చల్ చేస్తున్నాడు. లాక్ డౌన్‌లోనే కరోనా వైరస్ మీద సినిమా తీశాడంటే వర్మ పని తనం ఏంటో అర్థమవుతోంది. ఇలా నిరంతరంగా పని చేయడం వల్లే కరోనా వచ్చి ఉంటుందనే వార్తలు బయటకు వచ్చాయి.

    కండలు చూపిస్తూ..

    కండలు చూపిస్తూ..

    అయితే తనకు కరోనా వచ్చిందన్న వార్తలపై వర్మ సెటైర్ వేశాడు. కరోనా వచ్చిందన్న వార్తలు అవాస్తమని, తాను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో చూడండని కండలు చూపించాడు. ఎంచక్కా డంబెల్స్‌తో జిమ్ చేస్తూ.. కరోనా వార్తలను కొట్టిపారేశాడు. కానీ నేడు ఆయన లాయర్ మాత్రం కోర్టులో వేరే రకంగా చెప్పినట్టు తెలుస్తొంది.

    ‘మర్డర్'కేసులో..

    ‘మర్డర్'కేసులో..

    ఆర్జీవీ నిర్మిస్తున్న మర్డర్ చిత్రంపై కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్మ కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది. కానీ కరోనా సోకినందు వల్లే కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని అతని తరుపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వార్తలు తెగ ప్రచారం కాగా వర్మ మళ్లీ ఖండించాడు.

    అలాంటి వార్తలు నమ్మొద్దు..

    అలాంటి వార్తలు నమ్మొద్దు..

    లాయర్ తనకు కరోనా సోకిందని వస్తోన్న వార్తల్లో నిజంలేదని చెప్పుకొచ్చాడు. ‘నాకు కరోనా సోకిందని వస్తోన్న ఫేక్ న్యూస్‌ను నమ్మకండి. కొద్ది సేపట్లోనే థ్రిల్లర్ మూవీ కోసం అప్సర రాణితో కలిసి లైవ్‌లోకి రాబోతోన్న' అని ప్రకటించాడు. అయితే మొత్తానికి జనాల్లో మాత్రం ఓ పెద్ద కన్ఫ్యూజన్ మాత్రం నెలకొంది.

    Recommended Video

    Adire Abhi Opinion On RGV || గొప్ప సినిమాలు తీసిన మీరు.. ఇప్పుడేంటి ఇలా.?
    కరోనా లేదు గిరోనా లేదు..

    కరోనా లేదు గిరోనా లేదు..

    అయితే చెప్పినట్టుగా వర్మ.. అప్సరతో కలిసి లైవ్‌లోకి వచ్చాడు. వర్మ భుజంపై పడి మరీ ముచ్చట్లు పెడుతుంది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు అప్సర చదువుతుంటే.. వర్మ సమాధానాలు చెబుతున్నాడు. మరి ఇప్పటికైనా వర్మకు కరోనా లేదని అందరూ ఫిక్స్ అవుతారేమో చూడాలి.

    English summary
    RGV Condemns His Lawyers Statement About Corona. Don’t believe such fake news like me getting Corona .. I am live shortly on insta with apsara_rana
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X