»   » నా ప్రతీ సినిమా,షాట్ కాపీనే

నా ప్రతీ సినిమా,షాట్ కాపీనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

వేను చేసే ప్రతీ సినిమా,షాట్ ఎక్కడో చోట నుంచి నేను కాపీ కొట్టుకొచ్చిందే.నాలో ఒరిజినాలిటి అనేది అస్సలు లేదు.నన్ను నేను ఇతరుల క్రియేటివిని ట్రాన్స్ పోర్ట్ చేయటంలో బెస్ట్ అనుకుంటున్నాను.అలాగే ఒక్కోసారి సరిగ్గా ఎడాప్ట్ చేయక నాశనం చేస్తూంటాను అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా కాపీ విషయమై మాట్లాడుతూ ఇలా ట్విట్టర్ లో స్పందించారు.ఇక వర్మ తాజా చిత్రం డిపార్టమెంట్ ఈ రోజే మొదలైంది.

ఇక రామ్ గోపాల్ వర్మ తాజాగా డిపార్టమెంట్ గురించి బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ... డిపార్టమెంట్ చిత్రంలో అమితాబ్ బచ్చన్..పొలిటీషయన్ గా మారిన గ్యాంగస్టర్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే నా కెరీర్ లో ఈ చిత్రం బాగా ఎక్కవ బడ్టెట్ అవుతోంది. స్క్రిప్టు కూడా చాలా ప్రెష్ గా ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి బయట రకరకాల రూమర్స్ వినపడుతున్నాయి.

అమితాబ్..పోలీస్ ఆఫీసర్ గా నటించటం లేదు. అలాగే ఈ చిత్రం కంపెనీ కి సీక్వెల్ కాదు..అలాగే అబతక్ చప్పన్ కి ప్రీక్వెల్ కూడా కాదు. ఇక నాకు ఎప్పుడూ అమితాబ్ ని మాస్ హీరోగానే చూస్తాను. ఆయన్ని లార్జర్ దేన్ లైఫ్ హీరోగా డిపార్టమెంట్ లో చూపదలుచుకున్నాను. రానా ఈ చిత్రంలో చేస్తున్నాడు .రానా, సంజయ్ దత్ ఇద్దరూ పోలీస్ లు కనిపిస్తారు. రానా కు మెంటర్ గా సంజయ్ దత్ కనిపిస్తారు అన్నారు.ఇక కంగనా రౌనత్ ని అనుకున్న పాత్రకు లక్ష్మీ ప్రసన్నని తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మీ ప్రసన్న కూడా ఈ బాలీవుడ్ ప్రాజెక్టుకు చాలా ఉషారుగా ఉంది.

English summary
Every single thing I say nd every film I do nd every shot I take is copied from somewhere..there is not a shred of originality in me...RGV
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu