చిరంజీవిని డైరక్ట్ చేసే సామర్ధ్యం ఆయనకే ఉంది...వర్మ
రామ్ గోపాల్ వర్మ తాజాగా చిరంజీవిపై మళ్ళీ ట్వీట్ చేసారు. చిరంజీవి తన 150 చిత్రానికి చిరంజీవే డైరక్ట్ చేసుకుంటే బావుంటుందని, ఆ సామర్ధం ఆయనకే ఉందని అన్నారు. అలాగే 149 సినిమాల అనుభవం ఉన్న చిరంజీవికే దర్శకత్వం గురించి తెలియకపోతే మరి ఎవరికి అంత అవగాహన ఉంటుందని ప్రశ్నించారు. అలాగే చాలా గ్యాప్ తర్వాత చేసే ఈ చిత్రానికి వేరే డైరక్టర్ గాకుండా ఆయనే డైరక్షన్ చేసుకుంటే నేనే చుడ్డానికి మొదటి వరసలో ఉంటానన్నారు. ఇక ఆంధ్రా అంతా చిరంజీవి తనను తాను ఎలా డైరక్ట్ చేసుకుంటాడో చూడడానికి ఆత్రుతపడతారన్నారు.
డైరక్టెడ్ బై చిరంజీవి అనే టైటిల్ కార్డుపడితే చూడాలని ఉంది అన్నారు. ఇక చిరంజీవిని కొంత మంది దర్సకులు ప్లాప్ చేసి ఉండవచ్చు. కానీ చిరంజీవి ఏ డైరక్టర్ నూ ప్లాప్ చేయలేదన్నారు. అదే ఆయన డైరక్టర్ కావటానికి అర్హత అని అన్నారు. సినిమా అనేది కనిపెట్టినప్పటి నుంచి తీసిన చిత్రాల్లో నేను ఎక్కువ ఎదురు చూసే చిత్రం చిరంజీవి డైరక్ట్ చేసేదే అవుతుంది. అలాగే ఓ చిరంజీవి ప్యాన్ గా, ఆంద్రప్రదేశ్ సిటిజెన్ గా చిరంజీవి 150వ చిత్రం ఎవరు డైరక్ట్ చేసినా నాకు తృప్తి ఉండదు. కేవలం మెగాస్టారే తన చిత్రానికి డైరక్టర్ కావాలి అని రాసుకొచ్చారు. ఇక చిరంజీవిపై అభిమానానికో లేక వ్యంగ్యంగా రాసాలో ఈ మాటలు అనేది ఎవరికి అర్దం కావటం లేదు. ఎవరికి తోటినట్లు వారు అర్దం చేసుకుని వ్యాఖ్యానం చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











