»   » ఇంకా పవన్ ఫ్యాన్స్‌గా ఉంటే తెలంగాణకు ద్రోహమే... వర్మ మరో వివాదం!

ఇంకా పవన్ ఫ్యాన్స్‌గా ఉంటే తెలంగాణకు ద్రోహమే... వర్మ మరో వివాదం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అర్జున్ రెడ్డి' సినిమాను అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్‌ను, అతడి అభిమానులను టార్గెట్ చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి తెలంగాణలో ఉండే పికె ఫ్యాన్స్‌ను టార్గెట్ చేశాడు.

'తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏ వ్యక్తి అయినా 'అర్జున్ రెడ్డి' సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండకు కాకుండా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గా ఉంటారా! అంటూ ఆయన అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

అలా చేస్తే తెలంగాణకు ద్రోహమే

అలా చేస్తే తెలంగాణకు ద్రోహమే

‘అర్జున్ రెడ్డి' సినిమా చూసిన తర్వాత కూడా వారు విజయ్ దేవరకొండకు కాకుండా పవన్ కళ్యాణ్‌కు అభిమానిగా ఉంటే వారు తెలంగాణకు ద్రోహం, మోసం చేసినవాళ్లు అవుతారే తప్పా, మరేమీ కారు అంటూ వర్మ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు.

నా దృష్టిలో వాళ్లు అంతే

నా దృష్టిలో వాళ్లు అంతే

బ్రిటిష్ హయాంలో మన దేశానికి చెందిన నమ్మకద్రోహులు ఎలాంటి వారో..... నా దృష్టిలో ‘అర్జున్ రెడ్డి' సినిమా చూసి ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్న తెలంగాణకు చెందిన వారూ అంతే అంటూ వర్మ కామెంట్ చేశాడు.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే.... లుక్, స్టార్ చరిష్మా పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ కంటే 10 రెట్లు బెటర్, పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే పవన్ కళ్యాన్ కంటే 20 రెట్లు బెటర్ అని వర్మ పేర్కొన్నారు.

రియల్ పవర్ స్టార్

రియల్ పవర్ స్టార్

విజయ్ దేవరకొండలోని రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే అతడికి ‘రియల్ పవర్ స్టార్' అని బిరుదు ఇవ్వాలి అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

English summary
"My belief is that If anybody from the Telangana state if even now are still fans of PK more than Vijay Deverakonda even after seeing Arjun Reddy they are just nothing but despicable traitors to the Telangana cause as much as how the Indian betrayers were to the British." RGV said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu