అతను ఓ గాడిద : రామ్ గోపాల్ వర్మ మరో వివాదం

By Bojja Kumar

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెరలేపారు. గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ అలియాసా డేరా బాబాను ‘గాడిద'గా అభివర్ణించారు. క్లాస్ బ్రీడ్ అంటూ వివాదాస్పద పదజాలం వాడుతూ ట్వీట్ చేసాడు. గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ తెరకెక్కించిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమా నేపథ్యంలో వర్మ ఈ వ్యాఖ్యలు చేసారు.

డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ నటించిన వివాదాస్పద చిత్రం ‘మెసెంజర్ ఆఫ్ గాడ్‌' విడుదలైంది. ఈ సినిమాపై గత కొంత కాలంగా సెన్సార్ వివాదం నడుస్తోంది. ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా 4000 థియేటర్లలో విడుదలైంది. అయితే సినిమా విడుదలైన వెంటనే ఆందోళనలు తీవ్రం అయ్యాయి.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

RGV Controversial tweet on Ram Rahim singh

డేరా సచ్ఛా సౌధ అధ్యక్షుడు రామ్‌రహీమ్‌ సింగ్‌ నటించి, సంగీతాన్ని సమకూర్చి, దర్శకత్వం కూడా చేసిన చిత్రం ఇది. ఈ సినిమాలో రామ్‌ రహీమ్‌సింగ్‌ వేషధారణ 17వ శతాబ్దానికి చెందిన సిక్కుగురువును తలపించేలా ఉందని సిక్కులు భావిస్తున్నారు. బంగారు ఆభరణాలను ధరించిన గురువు బైకులను నడపడం వంటి వాటికి సర్వత్రా అభ్యంతరం వ్యక్తమైంది. ఇతరులు తప్పు పట్టడానికి సినిమాలో ఏమీ లేదనీ, డ్రగ్‌ అడిక్షన్‌ను, ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూనే ఈ సినిమా చేశామని రూపకర్తలు చెబుతున్నారు.

రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఆ మద్య సినిమా గురించి మాట్లాడుతూ ‘‘ఇందులో ఎవరూ వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ఈ చిత్రంలో నన్ను నేను దేవుడిగా ఎక్కడా ప్రదర్శించుకోలేదు. కనీసం ‘నేను దేవుడిని' అనే మాటను కూడా వాడలేదు. సినిమాను వ్యతిరేకించేవారు ముందు సినిమాను చూడండి. తర్వాత మాట్లాడండి'' అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X