RGV కరోనా వైరస్.. లాక్ డౌన్ తరువాత రిలీజ్ కాబోయే ఫస్ట్ ఫిల్మ్!
టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా అది కాంట్రవర్సీతోనే క్రేజ్ అందుకోవాలి. మర్డర్ జరిగినా భూ ప్రపంచం బద్దలైనా కూడా తన పనులు ఆగవని వర్మ లాక్ డౌన్ లోనే చాలా క్లియర్ గా చెప్పేశాడు. సరైన అవగాహనతో లాక్ డౌన్ లో జాగ్రత్తలు తీసుకొని కొన్ని సినిమాలను రూపొందించాడు.
కొన్నిటిని తన ATT ఫ్లాట్ ఫార్మ్ ఆర్జీవి వరల్డ్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో వర్మ ఎంతవరకు లాభాలు అందుకున్నాడో తెలియదు గాని నెక్స్ట్ లాక్ డౌన్ సడలింపులతో థియేటర్స్ లో మొదట తన సినిమానే నడవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో కరోనా అనే డిఫరెంట్ సినిమాను నిర్మించిన వర్మ లాక్ డౌన్ ఎండ్ అయ్యాక రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆగస్ట్ 15వ తేదీ తరువాత మల్టీప్లెక్స్, థియేటర్లు ఓపెన్ కాబోతున్న విషయం తెలిసిందే.

ఇక లాక్ డౌన్ తరువాత మొట్ట మొదట థియేటర్స్ లో విడుదల కాబోయే సినిమా కరోనా వైరస్ అంటూ ఆర్జీవి ఇటీవల ఒక పోస్టర్ ని విడుదల చేశాడు. అగస్త్య మంజు ఆ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను వర్మ లాక్ డౌన్ మొదట్లోనే పూర్తి చేశారు. ఒక ట్రైలర్ ని కూడా విడుదల చేసి మంచి హైప్ క్రియేట్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో తెరకెక్కిన మొట్ట మొదటి సినిమా ఇదేనని నేషనల్ మీడియా కూడా ఆర్జీవి సినిమాకు అప్పట్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. మరి వర్మ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











