twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ కి వర్మ ఘాటు కౌంటర్

    By Srikanya
    |

    ఒకరు నిజంగా ఏదైనా సాధించినప్పుడు తన సక్సెస్ గురించి తన గొంతు విప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రజలు ఆటోమేటిక్ గా దాని గురించే మాట్లాడుకుంటారు అంటూ రామ్ చరణ్ తేజ దూకుడు విషయంలో చాలా డిప్లమేటిక్ గా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్వీట్ కి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. ఆయన ట్వీట్ చేస్తూ.. విజయం సాధించిన వ్యక్తి చూట్టూ అసూయ చెందే వ్యక్తులతో నిండిపడి ఉండి అతన్ని ఫెయిల్యూర్ అని ఫీలయ్యేలా ఇన్ సిస్ట్ చేస్తూంటే అతనికి ఛాయిస్ ఉండదు కేవలం వాయిస్ మాత్రమే ఉంటుంది అన్నారు. దానికి రామ్ చరణ్ సమాధానంగా ట్వీట్ చేస్తూ.. మీరు చెప్పంది రైట్.. కానీ నీ ఎచీవ్ మెంట్స్ గురించి టూ మచ్ గా మాట్లాడుతూంటే అది ఇన్ సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్ లేకపోవటం, ఓవర్ సెన్సిటివ్ అన్నారు. ఇలా ట్విట్టర్ లో వీరి యుద్దం కొనసాగుతోంది. ఇది ఎక్కడదాకా వెళ్తుందో అని వీరిద్దరు అభిమానలు చూస్తున్నారు.

    మహేష్ తన దూకుడు చిత్రం గురించి ఆ మధ్య... ఇది అపీషయల్.. దూకుడు తెలుగు ఇండస్ట్రీలో హైయిస్ట్ గ్రాసర్.. అన్ బిలీవబుల్ అని ట్వీట్ చేసారు. ఈ విషయం అంతటా చర్చనీయాంశమైంది. మరో ప్రక్క మగధీర చిత్రంతో దూకుడుని పోలుస్తూ మెగాభిమానలు రీసెంట్ గా విజయవాడలో లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటించారు. దూకుడువి ఫేక్ రికార్డులని వారు అబియోగం. అయితే దానికి మహేష్ అభిమానులు స్పందిస్తూ.. దూకుడువి ఫేక్ రికార్డులని రుజువు చేస్తే కోటి ఇస్తామని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ ట్వీట్ చేయటం అంతటా వేడిక్కించింది. రామ్ చరణ్ అభిమానుల్లో ఆనందాన్ని కలుగచేసింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్.. రచ్చ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని సమాచారం. మరో ప్రక్క మహేష్ బాబు.. ది బిజెనెస్ మ్యాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

    English summary
    Ram Gopal Varma reply to Ram charan... "bt since a achiever mostly wil b surrounded by jealous ppl who insist on mkng hm fl lke a failure he hs no choice but to voice".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X