సింపుల్‌గా రామ్ గోపాల్ వర్మ కూతురు పెళ్లి (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : భారీ హంగులు, తారల తళుకుబెలుకులతో సినిమా రంగంలోని సెలబ్రిటీల కుటుంబాల్లో జరిగే వివాహాలకు భిన్నంగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి వివాహం జరిగింది. డాక్టర్ ప్రణవ్‌తో రేవతి వివాహం జరిగింది. సింపుల్‌గా, అతికొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

హిందూ సాంప్రదాయం ప్రకారం గురువారం హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు 250 మంది అతిథులకు మించి హాజరు కాలేదని సమాచారం. సాంప్రదాయాలకు దూరంగా ఉండే రామ్ గోపాల్ వర్మ కూతురు పెళ్లిలో మాత్రం పూర్తి సాంప్రదాయ బద్దంగా వ్యవహరించారట.

ఆయన స్వయంగా తెలుగు సాంప్రదాయం ప్రకారం అల్లుడు ప్రణవ్ కాళ్లు కడిగి కన్యాదానం చేసాడని తెలుస్తోంది. వర్మ కుమార్తె రేవతి వైద్య విద్యను అభ్యసించారు. ప్రణవ్‌ కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. వాళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రణవ్ తల్లి, తండ్రులు దుబాయి‌లో వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు.

పెద్దగా ఎవరినీ పిలవకుండా... కేవలం బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక నిర్వహించారు. వర్మ కూతురు కోరిక మేరకే ఇలా ఏ హడావుడి లేకుండా మీడియాకు దూరంగా ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. అయితే పెళ్లి ముందు సినీ రంగంలోని పలువురు ప్రముఖులకు పార్టీ ఇచ్చారు వర్మ.

రేవతి-ప్రణవ్

రేవతి-ప్రణవ్

వివాహ వేడుకలో రామ్ గోపాల్ వర్మ కూతరు రేవతి, అల్లుడు ప్రణవ్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. వీరి జంట ఎంతో చూడముచ్చటగా ఉందని అంతా అంటున్నారు.

రేవతి

రేవతి

రేవతి రేవతి వైద్య విద్యను అభ్యసించారు. ప్రణవ్‌ కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. ప్రణవ్ తల్లి, తండ్రులు దుబాయి‌లో వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఇలా అందరూ వైద్య వృత్తిలో కొనసాగుతుండటం విశేషమే మరి.

వర్మ వియ్యంకులు

వర్మ వియ్యంకులు

వీరే రామ్ గోపాల్ వర్మ వీయంకులు అని ఫోటో చూస్తే స్పష్టం అవుతోంది. కొడుకు ప్రేమ కోసం రామ్ గోపాల్ వర్మ కూతురుతో పెళ్లికి ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది.

సినిమాలకు దూరంగా

సినిమాలకు దూరంగా

ప్రముఖ దర్శకుడి కూతురు అయినప్పటికీ రేవతి మొదటి నుండీ సినిమాలకు దూరంగానే ఉంటూ వస్తోంది. అసలు సినీమా రంగానికే అంటీ ముట్టనట్లుగా వర్మ కుటుంబం ఉంటుంది. వర్మ మినహా ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఇప్పటి వరకు ఏ సినిమా ఫంక్షన్లోనూ కనిపించలేదు

ఆత్మీయులతో

ఆత్మీయులతో

ఆత్మీయులు, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ పెళ్లిలో సందడిగా గడిపింది రేవతి. వివాహం వేడుకలో ఆమె ముఖంలో ఒక సరికొత్త కాంతి కనిపించింది.

ఆగస్టు 15న జరిగిన వివాహం

ఆగస్టు 15న జరిగిన వివాహం

రేవతి-ప్రణవ్ వివాహం ముహూర్తం స్వాంతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న ఫిక్స్ చేసారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో రాత్రి 8.45 గంటల ప్రాంతంలో వివాహం జరిగింది.

కొద్ది మంది మాత్రమే

కొద్ది మంది మాత్రమే

పెద్దగా ఎవరినీ పిలవకుండా... కేవలం బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక నిర్వహించారు. వర్మ కూతురు కోరిక మేరకే ఇలా ఏ హడావుడి లేకుండా మీడియాకు దూరంగా ఈ పెళ్లి వేడుక నిర్వహించారు.

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

సాంప్రదాయ దూరంగా ఉండే రామ్ గోపాల్ వర్మ కూతురు పెళ్లిలో మాత్రం పూర్తి సాంప్రదాయ బద్దంగా వ్యవహరించారట. ఆయన స్వయంగా తెలుగు సాంప్రదాయం ప్రకారం అల్లుడు ప్రణవ్ కాళ్లు కడిగి కన్యాదానం చేసాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X