ఛీ..ఛీ అలాంటి సినిమా నేను చేయడం లేదు: వర్మ
హైదరాబాద్: ఇటీవల ఓ ఆంగ్లపత్రికలో రామ్ గోపాల్ వర్మ పోర్న్ సినిమా చేయబోతున్నాడని, ఇందుకోసం ఆయన అమెరికన్ పోర్న్ స్టార్ టోరీ బ్లాక్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా మండి పడ్డారు. సదరు కథనంపై ట్వీట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. సదరు వార్త రాసిన జర్నలిస్టుపై నాన్ సెన్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ కథనాన్ని రామ్ గోపాల్ వర్మ యెల్లో జర్నలిజంగా పేర్కొన్నారు.
ఇక రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా ‘365 డేస్' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా వర్మకు ఒక్క హిట్టూ లేదు. సినిమా తీసి జనాల మీదకి వదలడమే తప్ప...వాటి రిజల్ట్ పట్టించుకోవడం వర్మ అలవాటు లేదు. తనకు నచ్చినట్లుగా సినిమాలు తీయడమే ఆయనకు అలవాటు.

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుస చిత్రాలకు ప్లాన్ చేసుకున్నాడు. త్వరలో ఆయన దర్శకత్వం వహించిన ‘మొగిలిపువ్వు' చిత్రం విడుదల కాబోతోంది. త్వరలో మంచు మనోజ్ హీరోగా ‘అటాక్' అనే సినిమా తీయబోతున్నాడు. అలాగే ‘కిల్లింగ్ వీరప్పన్' పేరుతో స్మగ్లర్ వీరప్పన్ ను అంతం చేయడానికి పోలీసులు ఎలాంటి వ్యూహాలు అనుసరించారు అనే అంశంతో సినిమా చేయబోతున్నాడు.


Click it and Unblock the Notifications











