»   » అఖిల్ అక్కినేనితో సినిమా చేయబోతున్న రామ్ గోపాల్ వర్మ

అఖిల్ అక్కినేనితో సినిమా చేయబోతున్న రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున హీరోగా వచ్చిన 'శివ' సినిమా ద్వారా 1989లో దర్శకుడిగా తెరంగ్రేటం చేసిన రామ్ గోపాల్ వర్మ... త్వరలో నాగార్జున కొడుకు అఖిల్ అక్కినేనితో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

ప్రస్తుతం నాగార్జున హీరోగా 'ఆఫీసర్' అనే పోలీస్ డ్రామాను తెరకెక్కిస్తున్న వర్మ.... ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ 'నా తొలి చిత్రం శివ నాగార్జున నిర్మించారు. 25 ఏళ్ల తర్వాత నాగార్జున చేస్తున్న 'ఆఫీసర్' చిత్రాన్ని నేను నిర్మిస్తున్నాను. త్వరో నాగార్జున నిర్మాతగా అఖిల్ సినిమా రాబోతోంది, దానికి నేను దర్శకత్వం వహించబోతున్నాను' అంటూ వర్మ తెలిపారు.

RGV to direct Akhil Akkineni

ప్రస్తుతం అఖిల్ 3వ సినిమా వంకీ అట్లూరి దర్శకత్వంలో రెండు రోజుల క్రితం మొదలైంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత వర్మ దర్శకత్వంలో చేసే అవకాశం ఉంది. లవ్ స్టోరీలు తీయడం ఇష్టపడని వర్మ.... అఖిల్‌తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడో చూడాలి.

కాగా... నాగార్జున-వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆఫీసర్' చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

English summary
"Just love the circle of life Nagarjuna produced my debut 'Shiva' and now after some 25 years I produced Nagarjuna's 'Officer' and now in a full circle Nagarjuna is producing Akhil Akkineni's film with me as director" RGV said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X