»   » ప్రభాస్ హీరోయిన్ తో రామ్ గోపాల్ వర్మ 3D హర్రర్ చిత్రం

ప్రభాస్ హీరోయిన్ తో రామ్ గోపాల్ వర్మ 3D హర్రర్ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో రాత్రి, దెయ్యం, డర్నా మనా హై,డర్నా జరూరీ హై, ఫూంక్ వంటి హర్రర్ చిత్రాలు రూపొందించిన రామ్ గోపాల్ వర్మ మరో సారి జనాల్ని భయపెట్టేందుకు సిద్దపడుతున్నారు. అయితే ఈ సారి త్రీడి హర్రర్ లో ఆ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం లవ్ స్టోరీ షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన తన తదపురి చిత్రానకి స్క్రిప్టు రెడీ చేసుకున్నారు. ఏక్ నిరంజన్ తో తెలుగునాట పరిచయమైన కంగనా రనౌత్ ని ఈ హర్రర్ చిత్రానికి హీరోయిన్ గా తీసుకుంటున్నాడు. పూరీ జగన్నాధ్ పరిచయం చేసిన ఆమె ఆయనకు బాగా నచ్చటంతో ఈ ప్రాజెక్టుకు ఆమెను ఒప్పించాడు. అందులో ఆమెకు తెలుగు, హిందీలలో మార్కెట్ బాగా ఉండటంతో సినిమా బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నాడు.

English summary
Ram Gopal Varma is currently shooting for A Love Story, but he has already planned his next project.The maverick filmmaker is in talks with Kangana Ranaut for a 3D horror movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu