వర్మ 'దొంగల ముఠా' షూటింగ్ స్పీడుగా పూర్తవటానకి రీజన్

By Nageswara Rao

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం "దొంగలముఠా" షూటింగ్ మొదట చెప్పినట్లుగానే ఐదు రోజుల్లో పూర్తయ్యింది. ఈ విషయమై ఆయన మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో ఉన్న విషయం ఏమిటంటే...దొంగల ముఠా చిత్రం షూటింగ్ మునుపే చెప్పినట్లుగా కేవలం ఐదు రోజుల్లో ,కేవలం ఎనిమిది మంది క్రూ మెంబర్స్ తో దిగ్విజయంగా పూర్తయయ్యంది. అందరూ ఊహించుకున్నట్లుగా షూటింగ్ ఇరవై నాలుగు గంటల షెడ్యూలు తో కాకుండా కేవలం సాధారణ పనిగంటల్లో, ఏ ఒక్కరోజు నిర్ధేశించిన సమయం మించిపోకుండా పూర్తి చేయటం జరిగింది. ఇంత వరకూ మొత్తం ఫిలిం ఇండస్ట్రీలోనే ఎవరూ ఊహించని విధంగా ఆలోచించి, దానికి ఈ విధంగా కార్యరూపం ఇవ్వడం సినిమా మేకింగ్ లోనే ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. నాలుగు కెనాన్ కెమెరాలను ఉపయోగించి, ఒకేసారి నాలుగు యాంగిల్స్ లో ప్రతీషాట్ తీయటం వల్ల వేగంగా షూట్ చేయటం సాధ్యపడింది. అసలు లైట్స్ మరియు డాలీ, జిమ్మీ మొదలగు ఎక్విప్ మెంట్స్ ఉపయోగించకుండా సినిమా మొత్తం సహజమైన లైటింగ్ లో చేయటం జరిగింది. రవితేజ, ఛార్మి, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, బ్రహ్మాజి మరియు సుప్రీత్ మొదలగు వారున్న ఈ సినిమాను ఇండస్ట్రీలో మొదటిసారిగా జీరో బడ్జెట్(ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వకుండా)తో నిర్మించటం జరిగింది. నటులుకు,టెక్నీషియన్స్ లకు ఎటువంటి రెమ్యునేషన్ ఇవ్వబడటం లేదు. సినిమా రిలీజైన తర్వాత వచ్చే లాభాలతో మాత్రమే వాళ్ళకి రెమ్యునేషన్ ఇవ్వబడుతుంది. మొత్తం టెక్నాలజీని ఉపయోగిస్తూ , సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటూ మార్చి 4, 2011 న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. అంటే కేవలం సినిమా ప్రారంభించిన రోజు నుంచి 23 రోజుల్లోనే అని వర్మ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X