ఇది నా మీద కుట్ర, నాగార్జున లాంటి మంచోడు దొరికాడు: ఆర్జీవి ఎమోషనల్ స్పీచ్
Recommended Video

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆఫీసర్'. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'శివ' ట్రెండ్ సెట్టర్. దాదాపు పాతికేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 1న 'ఆఫీసర్' మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపత్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్‌గా ప్రసంగించారు.

ఇదంతా నా మీద కుట్రపన్నారు
రామ్ గోపాల్ వర్మ ప్రసంగించేందుకు వేదికపైకి వస్తుండగా కొంతమంది ఫారిన్ అమ్మాయిల గ్రూపు ఆయన్ను స్టేజీ మీదకు తీసుకొచ్చింది. దీనిపై వర్మ స్పందిస్తూ... దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను ఫారిన్ అమ్మాయిల ఐడియా నాది కాదు. ఇది నా యూనిట్లో ఉండే వారు నా మీద కుట్ర పన్ని చేశారు. ఈ విషయాన్ని నాగార్జున నమ్మితే చాలు. నా మీద కుట్ర పన్నినోళ్ల సంగతి తర్వాత చూస్తాను. అని వ్యాఖ్యానించారు. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ సీన్ కావాలనే క్రియేట్ చేశారని, తనపై ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పరోక్షంగా ఒక సందేశం పంపేందుకు వర్మ ఇలా సెట్ చేశాడని చర్చించుకుంటున్నారు.

ఈ సినిమా ఆలోచన అలా వచ్చింది
క్రైమ్ డ్రామాలు, రౌడీయిజం, యాక్షన్ సినిమాలు నేను ఎక్కువ ఇష్టపడటానికి కారణం చిన్నతనంలో ఉన్నపుడు క్లాస్ రూములో వెనక బెంచీలో కూర్చుని చాక్ పీస్ విసిరేవారు నాకు హీరోలుగా కనిపించేవారు. ముందు బెంచీవారి జట్లు లాగి, చదువు సరిగా చదవకుండా వారితో సావాసం పెట్టుకుని తర్వాత ఒక స్టేజీలో స్ట్రీట్ గుండాలను హీరోలుగా చూడటం మొదలు పెట్టాను. దాని తర్వాత గ్యాంగ్ స్టర్లు, ఫ్యాక్షనిస్టులను హీరోలుగా చూశాను. మొత్తం క్రిమినల్స్ అంతా అయిపోయారు. ఇపుడు మిగిలింది ఒక్కరే... ఆఫీసర్లను క్రిమినల్ ను చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా వచ్చింది. ఆ ఆలోచన నుండే ఈ సినిమా వచ్చింది అని వర్మ తెలిపారు.

రియల్ ఇన్సిడెంట్స్ నుండి
బాంబేలో ఒక రియల్ ఐపీఎస్ ఆఫీసర్‌ను కలిసినపుడు ఆయన చెప్పిన ఓ విషయం నుండి ఈ ఆలోచన వచ్చింది. అది నేను డెవలప్ చేసిన వెంటనే నాకు నాగార్జున గుర్తుకు వచ్చాడు. శివ తర్వాత నేను ఇంత వరకు హీరోయిజంతో సినిమా చేయలేదు. ఎంతసేపూ క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న సత్య, కంపెనీ లాంటి సినిమాలు చేశానే తప్ప హీరో పదానికి న్యాయం చేసే విధంగా సినిమా చేయలేదు. చాలా కాలం తర్వాత అసలైన హీరోయిజంతో ‘ఆఫీసర్' చేశాను అని వర్మ తెలిపారు

నాకు నాగార్జున లాంటి మంచోడు దొరికాడు
నేనెప్పుడూ పుణ్యాలు చేయలేదు, ఎప్పుడూ పెద్దలను గౌరవించలేదు, దేవుడిని కూడా ఎప్పుడూ పూజించలేదు. ఏ మంచి పనులు చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచి వ్యక్తి నా జీవితానికి దొరికాడు. ఇంతకు మించి మాట్లాడితే నా కళ్లలో నీళ్లు వచ్చేట్లు ఉన్నాయి. అది వస్తే నాకున్న వయొలెంట్ రెపుటేషన్ పోతుంది... అని వర్మ తెలిపారు.

నేను అడవి గుర్రం లాంటోన్ని
‘శివ' సినిమా అవకాశం ఇచ్చి నాగార్జున నాకు బ్రేక్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత నేను రకరకాల దారుల్లో వెళ్లాను. ఎన్నో వివాదాలకు కారణం అయ్యాను. అందులో నుండి నేను ఇంకా బయటకు వచ్చానని ఏమీ చెప్పడం లేదు. నేను ఒక అడవి గుర్రం లాంటోన్ని... ఇటూ అటూ పరుగెడుతూ ఉంటాను. వైల్డ్ హార్స్ ను పట్టుకుని ఆపితే అది మళ్లీ వైల్డ్ హార్స్ అవ్వదు. నాగార్జున నాకొక స్టీరింగ్ వీల్ లాగా అయిపోయాడు. దాంతో నేను కొంచెం కంట్రోల్ అవుతున్నాను.... అని వర్మ తెలిపారు.

ఈ క్రెడిట్ నాగార్జునదే
ఈ సినిమాకు నేను వందశాతం కమిట్మెంటుతో చేశాను. అది మీరు థియేటర్లో చూస్తారు. ఒక హిట్ సినిమాకు చాలా మంది కారణం అవుతారు. ప్లాప్ అయితే డైరెక్టరే కారకుడు. సినిమా అనేది ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. దాన్ని క్రియేట్ చేసే బాధ్యత దర్శకుడిది. ఈ సినిమా ద్వారా నన్ను నేను, ఒక వ్యక్తిగా రీ ఇన్వెంట్ చేసుకున్నట్లు భావిస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా నాగార్జునదే అని వర్మ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











