For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ గోపాల్ వర్మను రేపిస్టు బాబా ఇష్యూలోకి లాగారు, ఏం జరిగిందంటే?

  By Bojja Kumar
  |

  వివాదాస్పద అంశాలను క్యాచ్ చేసి తన పబ్లిసిటీ కోసం వాడుకోవడం, అలాంటి ఇష్యూలపై సినిమాలు తీసి క్యాష్ చేకోవడంలో రామ్ గోపాల్ వర్మను మించిన డైరెక్టర్ ఇండియాలో బహుషా లేరేమో. గతంలో ఏదైనా వివాదం మీడియాలో హైలెట్ అయినపుడు వాటిపై తాను సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటించిన సందర్భాలు అనేకం.

  దేశంలో గత వారం రోజులుగా రేపిస్టు బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సంగ్ ఇష్యూ హాట్ టాపిక్ నడుస్తున్నా వర్మ స్పందించ లేదు. వర్మ ఫోకస్ అంతా అర్జున్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మీదనే ఉంది. అయితే వర్మ ప్రకటించక పోయినా ఓ విషయం ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ అయింది.

  వర్మను ఈ ఇష్యూలోకి లాగారు

  వర్మను ఈ ఇష్యూలోకి లాగారు

  రేపిస్టు బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మీద వర్మ సినిమా తీస్తున్నట్లు ప్రకటించక పోయినా.... ఆయన సినిమా తీయడానికి రెడీ అవుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గుర్మీత్ బాబాగా న‌టించేందుకు బాలీవుడ్‌ నటుడిని ఎంపిక చేసుకునేందుకు వ‌ర్మ‌ సన్నాహాలు చేస్తున్నాడ‌ని బాలీవుడ్ లో చ‌ర్చ జ‌రుగుతోంది.

  సైలెంట్ వర్మ

  సైలెంట్ వర్మ

  రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకైతే ఈ విషయమై స్పందించలేదు. తన ప్రమేయం లేకుండానే తన గురించి మీడియాలో హాట్ హాట్ చర్చ జరుగుతుండటంతో సైలెంట్ ఎంజాయ్ చేస్తుననట్లు తెలుస్తోంది. రేపిస్టు బాబాపై వర్మ సినిమా తీస్తాడా? లేదా? అనేది అఫీషియల్ గా వెల్లడి కావాల్సి ఉంది.

  గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

  గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

  'డేరా సచ్చా సౌధా' అనే ఆధాత్మిక సంస్థ అధినేత, 'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమా హీరో..... రాక్ స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్టుతో ఉత్తరాది రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అతడిపై రేప్ కేసు రుజువుకావడంతో సీబీఐ కోర్టు 10+10 మొత్తం 20 ఏళ్లు శిక్ష విధించింది.

  దారుణాలు

  దారుణాలు

  తానే దేవుడిని అని చెప్పుకునే బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ఆశ్రమంలో మహిళలను బలవంతంగా లొంగదీసుకుని వారిపై అత్యాచారాలు చేశాడనే ఆరోపణలు రుజువు కావడంతో కటకటాల్లోకి వెళ్లాడు. అతడి అరెస్టు అనంతరం బాబా అనుచరులు హింసకు పాల్పడటంతో పదుల సంఖ్యలో పౌరులు మరణించారు.

  బాబా మీద సంచలన ఆరోపణలు

  బాబా మీద సంచలన ఆరోపణలు

  బాబా మీద అతడి అల్లుడు విశ్వాస్ గుప్త సంచలన ఆరోపణలు చేశారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన కూతురు హనీప్రీత్‌తో రాసలీలలు జరిపాడని, దీన్ని నా కళ్లతో స్వయంగా చూశానని విశ్వాస్ ఆరోపించారు.

  ఇన్నాళ్లు అందుకే...

  ఇన్నాళ్లు అందుకే...

  ఈ విషయం బయటకు చెబితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని, అందుకే ఈ విషయాన్ని ఇన్నాళ్లు బయట పెట్టలేదని విశ్వాస్ గుప్తా మీడియాతో చెప్పుకొచ్చారు. ఇపుడు గుర్మీత్ బాబా అరెస్టు కావడంతో ఈ రహస్యాన్ని బయట పెట్టాడట.

  హనీ‌ప్రీత్ దత్తత కూతురు

  హనీ‌ప్రీత్ దత్తత కూతురు

  హనీప్రీత్ సింగ్ అసలు పేరు ప్రియాంక. ఆమెనును డేరా బాబా దత్తత తీసుకున్నారట. బాబా జైలు కెళ్లడంతో ‘డేరా సచ్చా సౌధ' బాధ్యతలు హనీప్రీత్ తీసుకుంటుందనే వార్తల నేపథ్యంలో ఆమెపై ఈ ఆరోపణలు సంచలనం అయింది.

  ఆమె కూడా జైల్లోకి రావాలంటున్న బాబా

  ఆమె కూడా జైల్లోకి రావాలంటున్న బాబా

  పోలీసు క‌స్ట‌డీలో ఉన్న బాబా తాజాగా వేసిన పిటిషన్‌ చర్చనీయాంశం అయంది. జైలులో తనతో పాటు తన కుమార్తె హనీప్రీత్‌ ఇన్సాన్‌ కూడా ఉండాలని గుర్మీత్‌ ఆ పిటిషన్‌ లో పేర్కొన్నారు. తన దత్తత కూతురు, తాను ఒకే జైల్లో ఉండాలనుకుంటున్నామని కోరారు. దీనిపై స్పందించిన‌ సీబీఐ న్యాయస్థానం.. అందుకు ఒప్పుకోలేదు. ఈ విష‌యంలో స‌ర్కారు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.

  హనీ ప్రీత్ కూడా

  హనీ ప్రీత్ కూడా

  త‌న తండ్రికి నడుము నొప్పి, మైగ్రేన్‌ ఉందని ఆయనకి తరచూ ఆక్యూప్రెజర్‌ చేస్తుండాలని హనీప్రీత్ కూడా కోర్టును కోరింది. అంతేకాదు, తన కూతురిని జైలుకి రప్పించాలంటూ రోహ్‌తక్‌ జైలు అధికారులను గుర్మీత్‌ బాబా బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. త‌న మాట విన‌క‌పోతే జైలు అధికారులను సస్పెండ్‌ చేయిస్తానని కూడా అన్నారట.

  English summary
  Director Ram Gopal Varma, who always stays in hunt of controversial subjects to make films on them, is now reportedly planning to make a biopic on Baba Ram Rahim Singh, who was recently sent to 20 years in jail on Rape charges.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X